Share News

పంటలకు పాలమూరు మురుగు నీరు

ABN , Publish Date - Nov 22 , 2026 | 11:07 PM

ఎల్‌నినోతో రైతులు, సామాన్య ప్రజలు కరువుతో అల్లాడుతున్నారు.

పంటలకు పాలమూరు మురుగు నీరు

- ఎల్‌నినోను జయించిన శేరిపల్లి, హస్నాపూర్‌, పోతులమడుగు గ్రామాల రైతులు

- కరువు కాలంలో బోరు బావుల్లో పుష్కలంగా నీరు

భూత్పూర్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి) : ఎల్‌నినోతో రైతులు, సామాన్య ప్రజలు కరువుతో అల్లాడుతున్నారు. ఈ ఏడాది వర్షాకాలంలో సాధారణం కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ క్రమంలో యాసంగిలో రైతులు పొలాలను చదను చేసి వదిలేశారు. కనీసం ఆరుతడి పంటలు సాగు చేద్దామన్నా కుంటలు, చెరువుల్లో నీరు కూడా లేదు. ఇదిలా ఉంటే కొన్ని గ్రామాలకు నగరంలోని రోజు ఇళ్ల నుంచి వెలువడే మురుగు నీరు కాల్వల ద్వారా దిగువకు చేరుతోంది. ఈ నీరు 4 నుంచి 6 కిలో మీటర్ల దూరం పారుతుండటంతో మురుగు నీరు కాస్త సాధారణ నీరుగా తయారవుతోంది. దీంతో భూగర్భ జలాలు పెరగడమే కాకుండా రైతుల పంట పొలాలకు ఉపయోగపడుతోంది. దీంతో ఎండిపోతాయనున్న పంటలకు ఈ నీరు జీవం పోస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్‌ నగరం నుంచి వెలువడే మురుగు నీరు కాల్వల ద్వారా భూత్పూర్‌ మండలం శేరిపల్లి, హస్నాపూర్‌, తాటికొండ, పోతులమడుగు గ్రామాల శివారులోని చెరువులకు వెళ్లేది ప్రస్తుతం కట్టు కాల్వ ద్వారా వస్తున్న ఈ నీటిని రైతులు వారి పంట పొలాలకు మోటార్ల ద్వారా మళ్లించుకొని వరి, కూరగాయల పంటలకు సాగు నీరుగా వాడుకుంటున్నారు. దాదాపు 500 నుంచి 1000 ఎకరాలకు వరకు ఈ నీరు ఉపయోగపడటంతో వరి పంట చేతికొచ్చిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Nov 22 , 2026 | 11:07 PM