Share News

కంపు కొడుతున్న పాలమూరు బస్టాండ్‌

ABN , Publish Date - Jul 05 , 2026 | 11:27 PM

మహబూబ్‌నగర్‌ బస్టాండ్‌ కంపు కొడుతోందని ప్రజలు చెబుతుండటంతో ఆదివారం సీపీఎం ప్రతినిధి బృందం బస్టాండ్‌ పరిసరాలను పరిశీలించింది.

కంపు కొడుతున్న పాలమూరు బస్టాండ్‌
బస్టాండ్‌ పరిసరాలను పరిశీలించి వినతి పత్రం అందజేస్తున్న సీపీఎం నాయకులు

పాలమూరు, జూలై 5 (ఆంధ్రజ్యోతి) : మహబూబ్‌నగర్‌ బస్టాండ్‌ కంపు కొడుతోందని ప్రజలు చెబుతుండటంతో ఆదివారం సీపీఎం ప్రతినిధి బృందం బస్టాండ్‌ పరిసరాలను పరిశీలించింది. నూతనంగా నిర్మించిన కాంప్లెక్స్‌ కింద తాగుబోతులకు అడ్డాగా, వ్యభిచారానికి నిలయంగా మారిందని నాయకులు గుర్తించినట్లు తెలిపారు. దానివల్ల బస్టాండ్‌ ఆవరణ అపరి శుభ్రంగా మారటం, దుర్వాసన వెదజల్లటంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారని నాయకులు తెలిపారు. ప్రధాన ఎంట్రెన్స్‌ దగ్గర మరుగుదొడ్లు, బాత్‌రూంల నుంచి కలుషిత నీరు బయటకి వస్తోంది. అక్కడే ప్రయాణికులు ఆటోలో ఎక్కి పోవటానికి నరకయాతన అనుభ విస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బస్టాండ్‌ క్యాంటీన్‌ నుంచి వెలువడే మురికినీరు బస్టాండ్‌లోనే నిల్వ ఉంటోంది, దాని వల్ల కాలువలు నిండి నీళ్లుపోయే మార్గం లేకపోయిందన్నారు. బస్టాండ్‌ దగ్గర ఆటోలు నిలవటంతో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతోందన్నారు. రేవా హోటల్‌ దగ్గర ఆటోలు నిలపటంతో బస్సుల రాకపోకలు ఇబ్బంది ఏర్పడుతోందని ప్రయాణికులు, వ్యాపా రులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆర్టీసీ యాజమాన్యం, ట్రాఫిక్‌ పోలీసులు బస్టాండ్‌ను సందర్శించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సీపీఎం జిల్లా నాయకులు కురుమూర్తి, ఖమర్‌అలీ, వరదగాలెన్న, రాజ్‌, భాస్కర్‌, రవి, కృష్ణ, ఎల్లప్ప, ఖయ్యూం పేర్కొన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రం డిపో మేనేజర్‌కు అందజేశారు.

Updated Date - Jul 05 , 2026 | 11:27 PM