Share News

దేశానికే ఆదర్శంగా పాలమూరు

ABN , Publish Date - Jan 17 , 2026 | 11:38 PM

పాలమూరు జిల్లాను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, కాయకష్టానికి మారుపేరుగా ఉన్న పాలమూరును అభివృద్ధికి రోల్‌మోడల్‌గా మారుస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి తెలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో శనివారం పర్యటించిన ఆయన రూ.1,463 కోట్లతో ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌ భవనం, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, యంగ్‌ ఇండియా స్కూల్‌, నర్సింగ్‌ కాలేజీ, ఎంవీఎస్‌ కాలేజీ భవనం, తాగునీటి వ్యవస్థ బలోపేతం తదితర పథకాలకు శ్రీకారం చుట్టారు.

దేశానికే ఆదర్శంగా పాలమూరు
మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభ వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, చిత్రంలో మంత్రులు దామోదర రాజనరసింహ, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు

కాయకష్టానికి మారుపేరు మనం.. అభివృద్ధికి మోడల్‌గా మారుస్తాను

కరువు దూరం కోసం ప్రాజెక్టులు.. చదువు దగ్గర కోసం విద్యాసంస్థలు

పదేళ్లలో పాలమూరు జిల్లాలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు

పీఆర్‌ఎల్‌ఐ రావడం వెనుక విఠల్‌రావు, అప్పటి మంత్రి డీకే అరుణ కృషి

పాలమూరు- రంగారెడ్డిలో రూ. 25 వేల కోట్లు కాంట్రాక్టర్లకు బిల్లు ఇచ్చారు

భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ కోసం నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వలేదు

కేంద్రం మంజూరు చేసే ఐఐఎంను పాలమూరు జిల్లాలో ఏర్పాటు చేస్తా..

తప్పులు కప్పి పుచ్చుకోవడానికి పొంకనాలు కొడుతున్న ఆనాటి మంత్రులు

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలనే గెలిపించినా కొడంగల్‌- పేటకు న్యాయం చేయలేదు

మహబూబ్‌నగర్‌ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

మహబూబ్‌నగర్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పాలమూరు జిల్లాను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, కాయకష్టానికి మారుపేరుగా ఉన్న పాలమూరును అభివృద్ధికి రోల్‌మోడల్‌గా మారుస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి తెలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో శనివారం పర్యటించిన ఆయన రూ.1,463 కోట్లతో ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌ భవనం, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, యంగ్‌ ఇండియా స్కూల్‌, నర్సింగ్‌ కాలేజీ, ఎంవీఎస్‌ కాలేజీ భవనం, తాగునీటి వ్యవస్థ బలోపేతం తదితర పథకాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. పాలమూరు వెనుకబాటుతనానికి ప్రాజెక్టులు పూర్తికాక పోవడం, విద్యావ్యవస్థ సరిగా లేకపోవడం కారణమన్నారు. తామున్నప్పుడు ఏదో సాధించామని పదేపదే చె బుతున్న బీఆర్‌ఎస్‌ నేతలు.. తాను సీఎం అయ్యాక పనులు ఆ గిపోయయని అంటున్నారని, పదేళ్లలో ఏ ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారో చెప్పాలన్నా రు. వారి హయాంలో అనుమతిలిచ్చిన ప్రాజెక్టు ఏదైనా ఉందా? అని ప్రశ్నించారు. కేఎల్‌ఐ, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌, జూరాల సహా అన్ని ప్రాజెక్టులను కాంగ్రెస్‌ చేపట్టిందన్నారు. స్వరాష్ట్రం ఏర్పడే సమయంలో మిగిలిన పనులను కూడా పదేళ్లలో పూర్తి చేయలేదని మండిపడ్డారు. పీఆర్‌ఎల్‌ఐ ప్రాజెక్టు రావడం వెనుక స్వర్గీయ విఠల్‌రావు, ఆనాటి మంత్రి, ప్రస్తుత ఎంపీ డీకే అరుణ కృ షి ఉందన్నారు. 2013లోనే ప్రాజెక్టుకు అనుమ తి లభించిందని గుర్తు చేశారు. పదేళ్లలో పీఆర్‌ఎల్‌ఐని పూర్తి చేయకుండా.. రూ.25 వేల కో ట్లు కాంట్రాక్టర్లకు బిల్లుల రూపంలో ఇచ్చారన్నారు. కానీ ఉదండాపూర్‌ నిర్వాసితులకు పరిహారం ఇవ్వలేదన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తాను సీఎం అయ్యాక పరిహారం పెం చేందుకు కృషి చేశారని చెప్పారు. కొన్ని డబ్బు లు ఇచ్చామని, ఇంకా మొత్తం ఇవ్వాలని కోరుతున్నారని అన్నారు. రూ.12 కోట్లు ఖర్చు చేస్తే సంగంబండ బండ పగిలి 10 వేల ఎకరాలకు నీరందేదని, కానీ 10 ఏళ్లలో ఇవ్వలేదన్నారు. తాను సీఎం అయ్యాక ఆ రూ.12 కోట్లు ఇచ్చాన ని అన్నారు. కల్వకుర్తి చివరి ఆయకట్టు కోసం అప్పుడు ఎమ్మెల్సీగా, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉ న్న కసిరెడ్డి నారాయణరెడ్డి భూసేకరణకు రూ. 75 కోట్ల నిధులు అడిగితే ఇవ్వలేదని గుర్తు చేశారు.

ఆ పార్టీ వారినే గెలిపించినా న్యాయం చేయలేదు..

మక్తల్‌- నారాయణపేట- కొడంగల్‌ లిఫ్టు ఆ షామాషీగా రాలేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నా రు. అప్పటి నారాయణపేట ఎమ్మెల్యేగా ఉన్న చిట్టెం నర్సిరెడ్డి.. రాజశేఖర్‌రెడ్డి సీఎం అయ్యాక ఈ ప్రాంతానికి నీరు కావాలని, ఎత్తిపోతల అ వసరమని కోరారని అన్నారు. దీనికోసం భీమా ఎక్స్‌టెన్షన్‌ ప్రాజెక్టు కింద నిధులు ఇవ్వాలని కో రినట్లు తెలిపారు. తర్వాత వారిద్దరి మరణంతో ఆగిపోయిందన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ లిఫ్టు సాధించే బాధ్యత తీసుకున్నానని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చివరి జీఓ 69ను జారీ చేసి.. రూ.1,500 కోట్లతో పనులు చేపట్టాలని అనుకున్నట్లు తెలిపారు. తర్వాత కే సీఆర్‌ అధికారంలోకి వచ్చి మక్తల్‌, నారాయణపేట, కొడంగల్‌లో ఆ పార్టీ వారే గెలిచినా.. ప దేండ్లు ప్రాజెక్టును చేపట్టలేదన్నారు. పాలమూ రు నుంచి కేసీఆర్‌ను పార్లమెంట్‌కు పంపితే ఎందుకు ఈ ప్రాజెక్టు మీద వివక్ష చూపారని అన్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత కొడంగల్‌ లిఫ్టుకు నిధులు మంజూరు చేయించానన్నారు. 96 శాతం భూమి కోల్పోయే రైతులను ఒప్పించామని, నష్టపరిహారం వంద రో జుల్లో పూర్తిచేసే సంకల్పంతో ఉన్నామని అన్నా రు. ఈ జిల్లా వాడిని కాబట్టి ప్రాంత సమస్య లు, రైతుల కష్టాలపై అవగాహనతో ఉన్నానని అన్నారు. జూరాల పాత బ్రిడ్జి దెబ్బతింటోందని మంత్రి శ్రీహరి, ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి అం టే రూ.123 కోట్లతో కొత్త బ్రిడ్జి మంజూరు చే యించుకున్నామని అన్నారు. గత ప్రభుత్వంలో కొందరు మంత్రులుగా పనిచేశారని, వాళ్లు ఇ ప్పుడు పొంకనాలు కొడుతున్నారని సీఎం విమర్శించారు. ఆనాటి ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసి.. ఒక్కసారైనా మంత్రి హోదాలో సీఎం వద్దకు వెళ్లి పాలమూరు పెండింగ్‌ ప్రాజెక్టుల కు నిధులు కావాలని అడిగారా? అని ప్రశ్నించారు. అనుమతి లేకుండా ఫామ్‌హౌజ్‌కు వెళ్లే ధైర్యం చేయలేని వారు.. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు పొంకనాలు కొడుతున్నారని అన్నారు. తమ చేతికింద ఉండాల్సి న వారు, మోచితి నీళ్లు తాగాల్సిన వారు పాలించడమేంటనే కడుపుమంట తో కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో పాలమూరు కరువును వి దేశీ అతిథులకు చూపిం చి.. భిక్షం అడిగేవారని, కానీ భవిష్యత్‌లో అభివృద్ధిని చూపిస్తానని అన్నారు. ప్రభుత్వం వద్ద పంచడానికి భూములు లేవని, ఉచితంగా ఏమి ఇచ్చినా అది శాశ్వతం కాదన్నారు. విద్య ఒక్కటే శాశ్వతమన్నారు. వి జ్ఞానం ఉంటే రాష్ర్టాన్ని, దేశాన్ని ఏలగలిగే స్థా యికి చేరుతామన్నారు. అందుకు ఎడ్యుకేషన్‌, ఇరిగేషన్‌ను ప్రాధాన్యంగా తీసుకున్నట్లు తెలిపారు. క్రమశిక్షణ, నిబద్ధతతో విద్యార్థులు చదవాలన్నారు. సమావేశంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, అ జారుద్దిన్‌, ఎంపీ డీకే అరుణ, ఎ మ్మెల్సీ దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివా్‌సరెడ్డి, అ నిరుధ్‌రెడ్డి, జి.మధుసూధన్‌రెడ్డి, తూడి మేఘారెడ్డి, కూచుకుళ్ల రాజే్‌షరెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌, డీసీసీ వనపర్తి అధ్యక్షుడు శివసేనారెడ్డి, మైనారిటీ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ ముదిరాజ్‌, ప్రశాంత్‌ కుమార్‌రెడ్డి, రా జీవ్‌రెడ్డి, విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ యోగి తా రాణా, విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌, సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి మాణిక్‌రాజ్‌, ఇంటర్మీడియట్‌ కమిషనర్‌ కృష్ణభాస్కర్‌, స్పోర్ట్స్‌ అథారిటీ వైస్‌ చైర్మన్‌్క్షఎండీ సోనిబాలాదేవి, కలెక్టర్‌ విజయేందిర బోయి, ఎస్పీ జానకి తదితరులు పాల్గొన్నారు.

బాసర ట్రిపుల్‌ఐటీని పాలమూరుకు తీసుకొచ్చారు : మంత్రి దామోదర

‘ఇదివరకు ట్రిపుల్‌ ఐటీ కోసం బాసరకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి కావడం వల్ల బాసర ట్రిపుల్‌ ఐటీని పాలమూరుకు తెచ్చారు. రూ.200 కోట్లతో చేపట్టే ట్రిపుల్‌ ఐటీకి భూమి పూజ చేసుకోవడం సంతోషంగా ఉంద’ని జిల్లా ఇన్‌చార్జి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. వ్యవసాయంతో పాటు విద్య, వైద్య రంగాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సీఎం పనిచేస్తున్నారని కొనియాడారు. ప్రతీ ఒక్కరికి క్వాలిటీ విద్యను అందించాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని స్పష్టం చేశారు.

పాలమూరు అభివృద్ధికి కృషి చేయాలి : ఎంపీ అరుణ

ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ జిల్లా బిడ్డగా ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం రేవంత్‌రెడ్డికి వచ్చిందని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పాలమూరు అభివృద్ధికి కృషి చేయాలని కోరా రు. పాలమూరు-రంగారెడ్డిని చేపడితే జిల్లా సస్యశ్యామలం అవుతుందని తాను మంత్రిగా ఉన్నపుడు జీఓ తెస్తే కేసీఆర్‌ ఆ జీఓను విస్మరించారని దుయ్యబట్టా రు. రేవంత్‌రెడ్డి పాలమూరు-రంగారెడ్డిని పూర్తి చేసేందుకు కృషి చేయాలని, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారమైన అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు.

తడిగుడ్డతో గొంతుకోసిన గత పాలకులు: ఎమ్మెల్యే యెన్నం

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా ఆత్మగా ఉన్న పాలమూరును ఎడ్యుకేషన్‌, మెడికల్‌, ట్రాన్స్‌పోర్ట్‌ హబ్‌గా మార్చేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నారన్నారు. పాలమూరులో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, శాశ్వత తాగునీటి కల్పన, ట్రిపుల్‌ఐటీ, వంటి పనుల కోసం రూ.1400 కోట్ల నిధులు మంజూరు చేయడం గొప్ప విషయమన్నారు. వచ్చే మునిసిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గత పాలకులు పదేళ్ళ పాలనలో తడిగుడ్డతో పాలమూరు ప్రజల గొంతుకోశారని అన్నారు. కృష్ణా జలాలను పాలమూరుకు ఇవ్వాలని పాలమూరు-రంగారెడ్డిని త్వరితగతిన చేపట్టేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు.

పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి కావడం అదృష్టం: ఎమ్మెల్యే జీఎంఆర్‌

దేవరకద్ర ఎమ్మెల్యే జి మఽధుసూదన్‌రెడ్డి మాట్లాడు తూ పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి కావడం మన అదృష్టమని, జిల్లాకు ఏ పనులు కావాలన్నా వెంటనే అనుమతులు ఇస్తున్నారని అన్నారు. పాలమూరులో జరిగిన రైతు పండగకు వచ్చిన సమయంలో మంత్రులందరి సమక్షంలో జిల్లాకు ఏటా రూ.20 వేల కోట్ల ని ధులు ఇస్తానని ముఖ్యమంత్రి చెప్పారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం నిధులు ఇస్తూ జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్‌, నాగర్‌కర్నూల్‌ ఎంపీ డా.మల్లు రవి, ఎమ్మెల్యేలు అనిరుధ్‌రెడ్డి, ఈర్లపల్లి శంకర్‌, తూడి మేఘారెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి, రాంమ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, కలెక్టర్‌ విజయేందిరబోయి, మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి, స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ శివసేనారెడ్డి, మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ముదిరాజ్‌, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2026 | 11:38 PM