కిక్కిరిసిన విద్యార్థులు కిటికీలోంచి పాఠాలు
ABN , Publish Date - Oct 05 , 2026 | 11:31 PM
అది ప్రభు త్వ పాఠశాలే.. చూస్తే కార్పొరేట్ స్థాయి వసతులు.. ప్రైవేటు పాఠశాలల మాదిరిగా ఇక్కడ కూడా అడ్మి షన్ దొరకక వెనుదిరగాల్సిందే...
- మైకు ద్వారా బోధిస్తున్న ఉపాధ్యాయులు
- ఉత్తనూర్ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు తిప్పి పంపిన పరిస్థితి
అయిజ, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి) : అది ప్రభు త్వ పాఠశాలే.. చూస్తే కార్పొరేట్ స్థాయి వసతులు.. ప్రైవేటు పాఠశాలల మాదిరిగా ఇక్కడ కూడా అడ్మి షన్ దొరకక వెనుదిరగాల్సిందే... ఉపాధ్యాయులు మైకులో చెబితే గానీ విద్యార్థులకు పాఠాలు వినపడ ని పిరిస్థితి.. ఇది ఎక్కడో కాదు జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఉత్తనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఉన్న డిమాండ్.. దివంగత నేత తిర్మల్‌రెడ్డి గుడి, బడి బాగుండాల నే సంకల్పం గలవారు. ఆ రెంటినీ పక్కపక్కనే స మాన స్థాయిలో అభివృద్ధి చేశారు. పచ్చని చెట్ల మ ధ్య ఒకే గ్రౌండులో ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠ శాలల ఏర్పాటుకు కృషి చేశారు. రెండింటిలోనూ మె రుగైన వసతులు కల్పించారు. దీంతో విద్యార్థులు, ఈ పాఠశాలలలో చదివేందుకు ఆసక్తి చూపుతున్నా రు. ఐదు తరగతి గదులు, ఒక కార్యాలయం మా త్రమే ఉన్నాయి. కానీ ఉన్నత పాఠశాలలో విద్యార్థు ల సంఖ్య పరిమితికి అడ్మిషన్లు వస్తున్నాయి. ఈ పాఠశాల ప్రహరీలోని ప్రాథమిక పాఠశాలతో పాటు తుపతురాల, అంతంపల్లి, సంకాపూర్, ఈడిగోనిపల్లి గ్రామాల ప్రాథమిక పాఠశాలల నుంచి విద్యార్థులు చేరుతున్నారు. మొత్తంగా 362 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఒక్కో తరగతిలో 87 నుం చి 102 మంది విద్యార్థుల వరకు ఉన్నారు. వారి సం ఖ్యకు గదులు సరిపడక తరగతి గది బయట కూ ర్చొని కిటికిలోంచి పాఠాలు వింటున్నారు. దీంతో ఉ పాధ్యాయుల బోధన సరిగా వినపడకపోవడంతో మైక్ ద్వారా పాఠాలు చెబుతున్నారు. సెక్షన్లు చేద్దా మంటే ఉపాధ్యాయులు, తరగతి గదులు చాలటం లేదు. సింగిల్ ప్యాట్రన్ ఉపాధ్యాయులతో నెట్టు కొస్తున్నారు.