ఒకే మొక్కకు 2వేలకు పైగా పుష్పాలు
ABN , Publish Date - Oct 04 , 2026 | 11:19 PM
ఒకే మొక్కకు రెండు వేలకు పైగా పుష్పాలు వికసించాయి. ఈ అరుదైన పుష్పాలు మహబూబ్ నగర్ జిల్లా, జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని బొటానికల్ గార్డెన్‌లో చూపరులకు కనువిందు చేస్తున్నాయి.
- బొటానికల్ గార్డెన్‌లో పూసిన సెరోపేజియా జునీసియా మొక్క
జడ్చర్ల, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి) : ఒకే మొక్కకు రెండు వేలకు పైగా పుష్పాలు వికసించాయి. ఈ అరుదైన పుష్పాలు మహబూబ్ నగర్ జిల్లా, జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని బొటానికల్ గార్డెన్‌లో చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఈ మొక్క పేరు సెరోపేజియా జునీసియా అని, మహబూబ్‌నగర్ పట్టణ శివారులో దీనిని సేకరిం చామని బొటానికల్ గార్డెన్ సమన్వయకర్త డాక్టర్ సదాశివయ్య తెలిపా రు. 3:1 నిష్పత్తిలో ఇసుక, ఎర్రమట్టి, స్వల్పంగా కోకోపిట్ మిశ్రమంలో ఈ మొక్కను నాటినట్లు తెలిపారు. ఈ తీగ జాతి మొక్క ప్రస్తుతం కా క్టస్‌హౌజ్ అంతా పాకిందన్నారు. తక్కువ నీటి వినియోగం, తేమ తగ్గ డంతో ఏర్పడే స్వల్ప నీటి ఒత్తిడి, మట్టిలో నైట్రోజన్ అధిక పుష్పాల ఉ త్పత్తికి కారణం ఉండవచ్చన్నారు. శాస్త్రీయంగా నిర్ధారించేందుకు మరి న్ని పరిశీలనలు అవసరమని పేర్కొన్నారు. ఈ మొక్క వేదకాలం నుం చే ప్రాముఖ్యత, ప్రాశస్యం కలిగి ఉందని, ఇది కేవలం భారత ఉప ఖండంలోనే లభ్యం అవుతుందని ఆయన వివరించారు. దీని పువ్వులు 5 నుంచి 7 సెంటీమీటర్ల పొడవు ఉండి, గుండ్రటి ఫ్లాస్క్ లేదా గరాటు ఆకారంలో ఉంటాయి. పువ్వు పైభాగంలో రేకులు ఒకదానికొకటి కలిసి పారాచూట్ లాంటి నిర్మాణాన్ని కలిసి ఉంటాయి. ఇవి కీటకాలను ఆకర్షిస్తాయి.