పోరాటాలతోనే పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం
ABN , Publish Date - Jul 05 , 2026 | 11:43 PM
పాలకుల నిర్లక్ష్యం వల్ల ఏళ్ల తరబడిగా ముందుకు సాగని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండిం గ్ ప్రాజెక్టులకు పోరాటాలతోనే మోక్షం లభిస్తుం దని పెండింగ్ ప్రాజెక్టుల సాధన పోరాట జేఏసీ కో ఆర్డినేటర్, న్యాయవాది మధుసూదన్ బాబు అన్నారు.
జేఏసీ కో ఆర్డినేటర్ మధుసూదన్ బాబు
రౌండ్ టేబుల్ సమావేశం బ్రోచర్ విడుదల
గద్వాల టౌన్, జూలై 5 (ఆంధ్రజ్యోతి): పాలకుల నిర్లక్ష్యం వల్ల ఏళ్ల తరబడిగా ముందుకు సాగని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండిం గ్ ప్రాజెక్టులకు పోరాటాలతోనే మోక్షం లభిస్తుం దని పెండింగ్ ప్రాజెక్టుల సాధన పోరాట జేఏసీ కో ఆర్డినేటర్, న్యాయవాది మధుసూదన్ బాబు అన్నారు. ఇందుకోసం ఈనెల 19వ తేదీన మహ బూబ్‌నగర్ న్యూటౌన్‌లోని క్రౌన్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన విస్తృత రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. రౌండ్ టేబుల్ సమావేశం బ్రోచర్లను ఆదివారం పట్టణంలోని టీజేఎస్ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్బంగా మాట్లాడిన మధుసూదన్ బాబు, నికర జలాల కేటాయింపు ఉన్న ఆర్డీఎస్, జూరాల వంటి ప్రాజెక్టు ద్వారా ఇ ప్పటికీ పూర్తిస్థాయిలో నీటి వినియోగం జరగక పోవడం పాలకుల వైఫల్యమేనన్నారు. వరద జలాల ఆధారంగా చేపట్టిన నెట్టెంపాడు, గట్టు, పాలమూరు-రంగారెడ్డి, నారాయణపేట- కొండగల్, చంద్రసాగర్-అమ్రాబాద్ ఎత్తిపోతల పథకా లకు సంబంధించి కాలువలు అందుబాటులో లే క నీరందుకునే పరిస్థితి లేదన్నారు. పథకాల పేర్లు మార్చడం, ఎస్టిమేషన్లు పెంచడం, వాయిదాలు వేయడం అలవాటుగా చేసుకున్న పాల కులు ఉమ్మడి పాలమూరు రైతులను ఎప్పటిక ప్పుడు వంచనకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కాగా, 1997 జూన్ నెలలో మహబూబ్‌నగ ర్‌లో నిర్వహించిన కరువు వ్యతిరేక పోరాట మహాసభలో ప్రారంభ ఉపన్యాసం చేసిన ఆచార్య జయశంకర్ సాగునీటిపరంగా వివక్షకు గురైన మహబూబ్‌నగర్ జిల్లా దుస్థితి అర్థమైతే తెలంగాణ అసాంతం అర్థమవుతుందంటూ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం రైతులు, విద్యావంతులు, మైదావులు సంఘటిత పోరుకు సిద్దంకావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు ఆలూరు ప్రకాష్‌గౌడ్, ప్రభాకర్, ఎండీ సుభాన్, వాల్మీకి, వినోద్‌కుమార్, డాక్టర్ ప్రేమ్‌కుమార్, నాగన్న, కృష్ణ ఉన్నారు.