Share News

మిగిలింది పది రోజులే

ABN , Publish Date - Jul 22 , 2026 | 11:20 PM

కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్‌ఐఆర్‌ (ప్రత్యేక ఓటరు సవరణ) ప్రక్రియ గద్వాల జిల్లాలో 80శాతం పూర్తి చేశారు.

మిగిలింది పది రోజులే
గద్వాల పట్టణంలో ఎన్యుమరేషన్‌ ఫారాలు తీసుకుంటున్న బీఎల్‌వోలు

-చాలా చోట్ల బీఎల్‌వోలకు చేరని

ఎన్యుమరేషన్‌ ఫారాలు

- ఇళ్ల్లు దొరకక కొన్ని..

అద్దె ఇళ్లు మారడంతో మరికొన్ని

- గద్వాల జిల్లాలో 80 శాతమే డిజిటలైజేషన్‌

- పట్టణాల్లో తగ్గనున్న ఓటర్ల శాతం

గద్వాల, జూలై 22(ఆంధ్రజ్యోతి):కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్‌ఐఆర్‌ (ప్రత్యేక ఓటరు సవరణ) ప్రక్రియ గద్వాల జిల్లాలో 80శాతం పూర్తి చేశారు. అర్బన్‌ ప్రాంతాలలో మాత్రం నెమ్మదించింది. గడువు ఇంకా పదిరోజులే మిగలడంతో డిజిటలైజేషన్‌ 100శాతం పూర్తి చేసేందుకు అధికారులు వేగం పెంచారు. జిల్లాలో రెండు నియోజకవర్గాలలో 5,03,859మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటి వరకు 4,07,072 మంది ఓటర్ల మ్యాపింగ్‌ పూర్తి చేసుకొని డిజిటలైజేషన్‌ కూడా పూర్తి చేశారు. దాదాపు 80.79 శాతం పూర్తి అయ్యింది.

గద్వాల పట్టణంలో..

గద్వాల మునిసిపాలిటీలో మాత్రం డిజిటలైజేషన్‌ నెమ్మదించింది. మొత్తం ఓ టర్లు 66,566 మంది ఉండగా అందులో 41,601మంది ఓటర్లకు సంబంధించిన ఫా రాలు మాత్రమే డిజిటలైజేషన్‌ పూర్తి చే యడంతో 62.5 శాతానికి చేరుకున్నది. పట్టణంలో డిజిటలైజేషన్‌ శాతం తగ్గడాని కి ప్రధాన కారణం అద్దె ఇళ్లు మారడమేన ని తెలుస్తోంది. అంతేకాకుండా 2002లో ఓట్లు ఎక్కడ ఉన్నాయో గుర్తించకపోవ డం, చాలా మంది గ్రామాలతో పాటు పట్టణాల్లో కూడా ఓట్లు కలిగి ఉన్నారు. ఒక చోట మాత్రమే ఓటు ఉండాలన్న ఎన్నికల సంఘం హెచ్చరికతో ఎక్కువ మంది సొంత గ్రామాలకే ప్రాధాన్యం ఇవ్వ డం వలన గద్వాల పట్టణంలో డిజిటలైజేషన్‌ శాతం తగి ్గనట్లు తెలుస్తోంది. అంతే కాకుండా 2,461మందికి సంబం ధించి మ్యాపింగ్‌ కాకపోగా మిగిలిన ఓటర్ల ఫారాలు కొన్ని బీఎల్‌వోల వద్ద ఉన్నట్లు తెలుస్తోంది.

తగ్గనున్న ఓటర్ల సంఖ్య...!

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ వలన జిల్లాలో ఓటర్ల సంఖ్య భారీగానే తగ్గే అవకాశం ఉంది. ఇందుకు ప్రధాన కారణం డబుల్‌ ఓట్లు, మరణించిన వారి ఓట్ల తొలగింపుతో ఓటర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. గద్వాల నియోజకవర్గంలో 2,61,810మంది ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు 2,04,246మంది ఓటర్ల వివరాలు మాత్రమే మ్యాపింగ్‌తో పాటు డిజిటలైజేషన్‌ పూర్తి చేశారు. 14,003మందివి మ్యాపింగ్‌ జరగలేదు. వీరికి నోటీస్‌ ఇచ్చి అర్హత లేకపోతే తొలగిస్తారు. మిగిలిన ఓటర్లకు సంబంధించి ఎన్యుమరేషన్‌ ఫారాలు బీఎల్‌వోలకు చేరలేదు. ఈ ఫారాలు పూర్తి చేసి ఇస్తేనే ఓటరు జాబితాలో పేరు నమోదు చేయనున్నారు. అలంపూర్‌ నియోజవర్గంలో 2,42,049మంది ఓటర్లు ఉండగా 2,02,826మంది ఓటర్ల వివరాలు మ్యాపింగ్‌తో పాటు డిజిలైజేషన్‌ పూర్తయింది. 9,699మంది ఓటర్ల వివరాలు మ్యాపింగ్‌ జరగలేదు. మిగిలిన ఓటర్ల ఎన్యుమరేషన్‌ ఫారాలు బీఎల్‌వోలకు ఇవ్వలేదు. ఫారాలు పూర్తి చేసి ఇస్తేనే ఓటరు జాబితాలో చేరుస్తారు. కానీ చాలా మంది ఓటర్లు ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - Jul 22 , 2026 | 11:20 PM