Share News

ఆరుతడి పంటలే సాగు చేయాలి

ABN , Publish Date - Jul 14 , 2026 | 11:26 PM

రైతులు ఆరుతడి పంటలే సాగు చేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి గోవింద్‌నాయక్‌ పేర్కొన్నారు.

ఆరుతడి పంటలే సాగు చేయాలి
ఎన్‌నిలో ప్రభావంపై రైతులకు వివరిస్తున్న డీఏవో గోవింద్‌నాయక్‌

భూత్పూర్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి) : రైతులు ఆరుతడి పంటలే సాగు చేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి గోవింద్‌నాయక్‌ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు నేస్తం కార్యక్రమాన్ని వీక్షించడానికి మండలంలోని వివిధ గ్రామాల రైతులు హాజరుకాగా, డీఏవో గోవింద్‌ నాయక్‌ రైతులకు ఎల్‌నినో ప్రభావం గురించి వివరించారు. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరు గుతున్నాయని, రైతులు బోరు బావుల కింది వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చే సుకోవాలన్నారు. ఇప్పటికే సాగు చేసిన పంటల ను కాపాడుకోవడానికి రైతులు యాజమాన్య పద్ధతులను రైతు నేస్తం వారు అందిస్తున్న సూచనలు, సలహాలను పాటించాలన్నారు. ఏవో మురళిధర్‌, ఏఈవో నాగన్న పాల్గొన్నారు.

Updated Date - Jul 14 , 2026 | 11:26 PM