టార్గెల్‌లో సగమే..
ABN , Publish Date - Nov 01 , 2026 | 11:39 PM
ఎల్‌నీనో ప్రభావం.. కరువు మండలాల ప్ర కటన.. ఇప్పుడు అందరి దృష్ఠి వీబీ జీరామ్‌జీ ప థకంపై పడింది. కరువును అధిగమించాలంటే వీబీ జీరామ్‌జీ పఽథకంలో పనిచేసే కూలీలకు సాధ్యమైనన్ని పనిదినాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. జలసిరి ద్వారా నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యం ఇ వ్వాలని నిర్ణయించారు.
- ప్రతీ గ్రామంలో 60 మంది లక్ష్యం
- ఉమ్మడి జిల్లాలో సగటున 30 మంది మాత్రమే ఉపాధి పనులకు..
- అడిగినన్ని పనులు కల్పించాలంటున్న ప్రభుత్వం
- 125 రోజుల పనిదినాల కోటా ఎత్తేయాలంటున్న కూలీలు
- వీబీ జీరామ్‌జీ పనులతో కరువు ప్రభావం తగ్గించాలని నిర్ణయం
- పశుగ్రాసం యూనిట్‌కు రూ.14,023.. నీటితొట్టి నిర్మాణానికి రూ.34,707
- ఉమ్మడి పాలమూరులో 77 మండలాల్లో 52,288 మంది పనికి..
మహబూబ్‌నగర్, నవంబరు 1 (ఆంధ్రజ్యో తి): ఎల్‌నీనో ప్రభావం.. కరువు మండలాల ప్ర కటన.. ఇప్పుడు అందరి దృష్ఠి వీబీ జీరామ్‌జీ ప థకంపై పడింది. కరువును అధిగమించాలంటే వీబీ జీరామ్‌జీ పఽథకంలో పనిచేసే కూలీలకు సాధ్యమైనన్ని పనిదినాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. జలసిరి ద్వారా నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యం ఇ వ్వాలని నిర్ణయించారు. గ్రామాల్లో పెద్ద ఎత్తున పనులు చే పట్టాలని ఇప్పటికే అధికార యంత్రాం గం సిబ్బందిపై ఒ త్తిడి తీసుకువస్తోం ది. అయితే, అధికా రులు ఇచ్చిన టార్గె ట్‌లో కేవలం 50 శాతం మాత్రమే రీచ్ అవుతున్నారు. ఒక్కో గ్రామంలో ప్రతీరోజు60 మందికి తక్కువ కాకుండా ప నికి వచ్చేలా టార్గెట్ విధించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా లో 16 78 గ్రామా లుండగా, లక్ష మం దికి తగ్గకుండా ప నికి తీసుకెళ్లాలి. అయితే, శనివారం ఉమ్మడి జిల్లాలో పనిచేసిన కూలీల సంఖ్య 52,288 మంది.. అంటే ఇచ్చిన టార్గెట్‌లో 50 శాతం మాత్రమే కూలీలు పని చేస్తున్నారు. సగటున ప్రతీరోజు ఒక్కో గ్రామంలో 30 మంది కూలీలు మాత్రమే పనిచేస్తున్నారు. సిబ్బందికి కూలీల సంఖ్య పెంచాలని అధికారులు తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు. పనుల సంగతి తరువాత ముందు లేబర్‌ను పనికి తీసుకురావాలన్న లక్ష్యంతో పనులు చేయిస్తున్నారు. అన్ని గ్రామాల్లో పనులు ప్రారంభం కావాల్పిందేనని లేదంటే సిబ్బంది జీతాలు నిలిపివేస్తామని హెచ్చ రికలు జారీ చేయడంతో క్షేత్రసాయిలో పర్యటిస్తూ కూలీల సంఖ్యను పెంచే పనిలో పడ్డారు. అయితే ఇదివరకు జాబ్‌కార్డుకు 100 రోజుల పనిదినాలు కల్పిస్తుండగా, ఇటీవల 125కు పెంచారు. కరువు నేపథ్యంలో ఈ పనిదినాల కోటా ఎత్తేయాలని కూలీలు డిమాండ్ చేస్తున్నారు
నీటి తొట్లకు, పశుగ్రాసం యూనిట్‌లకు నిధులు
కరువు పరిస్థితుల నేపథ్యంలో పథకంలో కొన్ని రకాల పనులు చేరుస్తున్నా రు. ప్రస్తుతం చెరువులలో నీళ్లు లేకపోవడం, బోర్లలో భూగర్భ జలాలు అడు గంటడం వంటి కారణాలతో పశువుల గ్రాసం, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని పథకంలో వాటికి నిధులు కేటాయిస్తున్నారు. నీటితొట్ల నిర్మాణం కోసం రూ.34,707 కేటాయిస్తున్నారు. అదేవిధంగా పశుగ్రాసం పెంపకం యూని ట్‌కు రూ.14,023 కేటాయించారు. వీటితో పాటు ప్రస్తుతం జలసిరి పనులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫాంపాండ్, పర్క్యూలేషన్ ట్యాంక్‌ల నిర్మాణం, ఇంకుడు గుంతలు, సోక్‌పిట్‌లు వంటి పనులు చేపడుతున్నారు. గతంలో చేపట్టి పెండిం గ్‌లో ఉన్న చెరువుల పూడికతీత పనులు కూడా చేసుకోవచ్చు. అయితే ఈ ప థకంలో జాబ్‌కార్డు ఉన్న కూలీలు అడిగిన వారికి అడిగిన పనిదినాలు కల్పించా లని, కూలీల సంఖ్య గణనీయంగా పెంచాలని అధికారులు సిబ్బందిపై తీవ్ర ఒ త్తిడి తీసుకువస్తున్నారు. కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిధులతో సీసీరోడ్లు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, కమ్యూనిటీ భవనాలు, పాఠశాలల అదనపు తరగతి గదులు, అంగన్‌వాడీ, జీపీ భవనాల నిర్మాణాలు చేపట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
ఇందిరమ్మ ఇంటికి 90 రోజుల పనిదినాలు
ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు 90 రోజుల పనిదినాలు కల్పించారు. ప్ర తిరోజు రూ.307 చొప్పున లబ్ధిదారుడి ఫోటో ప్రతీరోజు తీసి అప్‌లోడ్ చే స్తారు. ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షలలో వీబీ జీరామ్‌జీ కింద ఈ పని దినా లకు రూ.27,630 చెల్లిస్తారు. ఇవికాక సోక్‌పిట్‌కు రూ.6,500, ఐహెచ్‌ఎల్ (బాత్‌రూమ్)కు రూ.12 వేలు ఈ పథకం ద్వారానే చెల్లింపులు చేసి ఇవి పోనూ మిగతా సొమ్ము లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తారు.