కొనసాగుతున్న యజ్ఞాలు, కుంకుమార్చన
ABN , Publish Date - Jan 09 , 2026 | 11:42 PM
కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ ఆధ్వ ర్యంలో 88వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం కొనసాగుతుంది.
నేడు శ్రీనివాస కల్యాణం, రేపు సీతారామ పట్టాభిషేకం
గద్వాల, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ ఆధ్వ ర్యంలో 88వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం కొనసాగుతుంది. శుక్రవారం యజ్ఞాలు నిర్విరామంగా కొనసాగుతుండగా, మరో పక్క మ హిళలకు కుంకుమార్చన కార్యక్రమం కొనసాగింది. పది రోజులుగా సాగుతు న్న శ్రీకృష్ణ కాలచక్రంకు రోజురోజుకు భక్తుల సంఖ్య పెరుగుతుంది. మహాబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ యజ్ఞంలో పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా యజ్ఞశాలతో పాటు శ్రీకృష్ణ పీఠాధిపతి కృష్ణజ్యోతి స్వరూపానందస్వామిని ఎంపీ దర్శించుకున్నారు. కాగా స్వామీజీ తలపెట్టిన విష్ణుపంచాయతనం, ఆయుత చండీ అతిరుద్రం, యజ్ఞం కొనసాగుతుందగా శనివా రం శ్రీశ్రీనివాస కల్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం సీ తారామ పట్టాభిషేకంను వైభవంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
భక్తిశ్రద్ధలతో సింధూర్ కుంకుమార్చన
ఎర్రవల్లి, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లా పుణ్యక్షేత్రమైన బీచుపల్లి రామాలయంలో శుక్రవారం వీహెచ్‌పీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సిందూర్ కుంకుమార్చన, రుద్రాక్ష అర్చన భక్తిశ్ర ద్దలతో నిర్వహించారు. దేశ సమగ్రత, సమైక్యదేశరక్షణ కోసం హనుమాన్‌చాలీసాను పఠించారు. కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నా రు. వీహెచ్‌పీ మహిళా కన్వీనర్ శోభారాణి, రాఘవేంద్రాచార్యులు, జయసింహరావు, ఫణిమోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.