ప్రజలకు మేలు చేసేలా పనిచేయాలి
ABN , Publish Date - Oct 15 , 2026 | 11:20 PM
వ్యాపారులను భయాందోళనకు గురిచేసి అయిజ అభివృద్ధిని అడ్డుకుని చరిత్రహీనులుగా మారవద్దని మునిసిపల్ చైర్మన్ సీఎం సురేశ్ తెలిపారు.
అయిజ మునిసిపల్ చైర్మన్ సీఎం సురేశ్
ఎన్నికలు ముగిశాక కక్షసాధింపు పనులు వద్దు
అయిజ టౌన్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): వ్యాపారులను భయాందోళనకు గురిచేసి అయిజ అభివృద్ధిని అడ్డుకుని చరిత్రహీనులుగా మారవద్దని మునిసిపల్ చైర్మన్ సీఎం సురేశ్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నాయకులు, కౌన్సిలర్లతో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ 99శాతం అయిజలో బయటి నుంచి వచ్చిన వారే వ్యాపారాలు చేసుకుంటున్నారని చెప్పారు. బ యటి నుంచి వచ్చిన వారిని భయపెడితే అయి జలో పెట్టుబడులు ఎలా పెడతారన్నారు. మునిసిపాలిటీ ఏర్పడి 12 సంవత్సరాలు అయితే 10సంవత్సరాలు పాలకవర్గంలో మీరూ ఉన్నారు. 150 కోట్లు మునిసిపాలిటీకి నష్టం వచ్చిందని ఆరోపణలు చేయడం కాదు నిరూపించాలన్నారు. మునిసిపల్ చట్టాలపై అవగాహన లేక కొందరు నిర్మాణాలు చేపడితే పరిష్కారం చూ పకుండా కూల్చి వేస్తామనడం సరికాదన్నారు. వ్యాపారులపై కాకుండా ఏదన్నా ఉంటే రాజకీయంగా చూసుకోవాలన్నారు. ఎంపీ, మంత్రిని గెలిపించిన ప్రజల కోసమే ప్రతీ ఒక్కరు పని చేయాలని అన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత అందరూ కలిసి అభివృద్ధి చేయాలి కానీ కక్షసాధింపులు కాదన్నారు. వ్యాపారులకు మేము అండగా ఉంటామని అయిజ అభివృద్ధికి అందరూ సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ మాల నర్సింహులు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.