Share News

స్వదేశీ వస్తువులు వాడాలి

ABN , Publish Date - Nov 01 , 2026 | 11:32 PM

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం నారాయణపేట జిల్లా కేంద్రంలో పథ సంచలన్‌ నిర్వహించారు.

స్వదేశీ వస్తువులు వాడాలి
నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన పథ సంచలన్‌లో స్వయం సేవకులు

స్వదేశీ వస్తువులు వాడాలి

- ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రాంత ప్రచారక్‌ దేవేందర్‌జీ

- నారాయణపేటలో కొనసాగిన పథ సంచలన్‌

నారాయణపేట క్రైం, నవంబరు 1 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం నారాయణపేట జిల్లా కేంద్రంలో పథ సంచలన్‌ నిర్వహించారు. నారాయణపేట, దామరగిద్ద, ఊ ట్కూరు ఖండల నుంచి స్వయంసేవకులు పథ సంచలన్‌లో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని పురవీధుల గుండా పథసంచలన్‌ కొనసాగింది. మినీస్టేడియం మైదానంలో జరిగిన సభలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రాంత ప్రచారక్‌ దేవేందర్‌జీ మా ట్లాడారు. హిందువుల సంఘటితం కోసం ఆర్‌ ఎస్‌ఎస్‌ను డాక్టర్‌ బజి చిన్నతనంలో ప్రారంభిం చారన్నారు. వర్ణం, కులంపేరుతో విడిపోయిన భారతదేశం సంఘటితం కోసం రాష్టీయ స్వ యం సేవక్‌ సంఘ్‌ కృషి చేస్తుందన్నారు. ఎంతో మంది మహనుభావులు దేశంలోని సాధారణ ప్రజల్లో సనాతన ధర్మం పట్ల నిష్టను కల్పించి దే శానికి స్వాతంత్య్రం వచ్చేలా పోరాడారన్నారు. ప్రస్తుతం సంఘ విద్రోహ శక్తులకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. స మాజంలోని అన్నివర్గాల ప్రజలను కలుపుకొని సమరసత, ఐక్యతతో ముందుకు సాగాలని పే ర్కొన్నారు. కుటుంబమే సంస్కారాలకు ప్రాథమి క కేంద్రంగా నిలుస్తుందని తల్లిదండ్రులు, పెద్ద లు చిన్నతనం నుంచే పిల్లలకు నైతిక విలువలు, దేశభక్తిని అలవర్చాలన్నారు. మునిసిపల్‌ చైర్‌ప ర్సన్‌ కొండా శ్వేతసత్యయాదవ్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ మంజులరాఘవేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు జయశ్రీ, క మలాపూర్‌ ప్రభాకర్‌, బీజేపీ నాయకుడు నా గూరావు నామాజీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నారాయణపేట సంఘ చాలక్‌ డాక్టర్‌ మదన్‌మోహన్‌రెడ్డి, ఊ ట్కూర్‌ సంఘచాలక్‌ నీలిబ రాంరెడ్డి, మ్యా డం ప్రభాకర్‌, స్వయం సేవకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 01 , 2026 | 11:32 PM