Share News

అబుల్‌ కలాంను ఆదర్శంగా తీసుకోవాలి

ABN , Publish Date - Nov 15 , 2026 | 11:25 PM

భారత స్వాతంత్య్ర సమరమోధుడు, బహుభాషా కోవిదుడు, దేశ విద్యారంగ అభివృద్ధికి పునాది వేసిన మౌలానా అబుల్‌ కలాంను ఆదర్శంగా తీసుకోవాలని మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌ పేర్కొన్నారు.

అబుల్‌ కలాంను ఆదర్శంగా తీసుకోవాలి
వివిధ రంగాల్లో సేవలు అందించిన వారితో టీ.ఆల్‌మేవా జిల్లా, రాష్ట్ర ప్రతినిధులు

- టీజీఎంఎఫ్‌సీ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌

- టీఆల్‌మేవా ఆధ్వర్యంలో అబుల్‌ కలాం జయంతి

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి) : భారత స్వాతంత్య్ర సమరమోధుడు, బహుభాషా కోవిదుడు, దేశ విద్యారంగ అభివృద్ధికి పునాది వేసిన మౌలానా అబుల్‌ కలాంను ఆదర్శంగా తీసుకోవాలని మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌ పేర్కొన్నారు. అబుల్‌ కలాం అజాద్‌ జయంతి వేడుకలను ఆదివారం టీ.ఆల్‌మేవా జిల్లా అధ్యక్షుడు మహ్మద్‌అయూబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించగా, మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ముదిరాజ్‌, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మిఽథున్‌రెడ్డి హాజరై ఉమ్మడి జిల్లా వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మౌలానా అబుల్‌ కలాం దేశ విద్యాభివృద్ధికి ఎంతోగానో కృషి చేశారని, ఆయన సమయంలోనే యూజీసీ, ఐఐటీ వంటి అత్యున్నత విద్యా సంస్థలను స్థాపించడం జరిగిందన్నారు. మైనార్టీల సంక్షేమానికి, హిందూ, ముస్లింల సమైక్యతకు కృషి చేశారన్నారు. టీ.ఆల్‌మేవా రాష్ట్ర అధ్యక్షుడు ముస్తా, జిల్లా సెక్రటరీ అబ్దుల్‌ఖాదర్‌, తాహెర్‌, సిరాజ్‌, జైనులాబుద్దీన్‌, అబ్దుల్‌రహెమాన్‌, మంజూర్‌అలీ, ముఖ్తర్‌, నాయకులు మహ్మద్‌హనీఫ్‌ అహ్మద్‌, ఖలీల్‌, మోసీన్‌ఖాన్‌, బాబర్‌షేక్‌, జకీ, జావిద్‌, దస్తగీర్‌, ఉస్మాన్‌ అకిల్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2026 | 11:25 PM