క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలి
ABN , Publish Date - Oct 27 , 2026 | 11:35 PM
క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించి జట్టు విజయానికి దోహదపడాలని ఇన్‌చార్జి డీవైఎస్‌వో రామలింగేశ్వర్‌గౌడ్ అన్నారు.
- ఇన్‌చార్జి డీవైఎస్‌వో రామలింగేశ్వర్ గౌడ్
- రెండో రోజు కొనసాగిన రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు
గద్వాల అర్బన్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించి జట్టు విజయానికి దోహదపడాలని ఇన్‌చార్జి డీవైఎస్‌వో రామలింగేశ్వర్‌గౌడ్ అన్నారు. మంగళవారం రెండోరోజు జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియం గ్రౌండ్‌లో ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి అండర్-17 బాలుర క్రికెట్ పోటీలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని మాట్లాడారు. సమష్టి కృషితో రాణించాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి తోట శ్రీనివాసులు, టోర్నమెంట్ పరిశీలకుడు డేవిడ్ సన్, బీసన్న, ఫిజికల్ డైరెక్టర్లు, వ్యాయామ ఉపాధ్యాయులు ఉన్నారు.
రెండో రోజు మ్యాచ్‌ల వివరాలు
రెండో రోజు మొదటి మ్యాచ్ నల్లగొండ- నిజామాబాద్ జట్లు ఆడాయి. మొదట బ్యాటింగ్‌కు దిగిన నిజామాబాద్ జట్టు నిర్ణీత 12 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. అనంతరం నల్లగొండ జట్టు ఎనిమిది ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 82పరుగులు చేసి గెలుపొందింది. రెండో మ్యాచ్ మెదక్- అదిలాబాద్ జట్లు ఆడాయి. మొదట బ్యాటింగ్ చేసిన మెదక్ జట్టు నిర్ణీత 12 ఓవర్లలో పది వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. అనంతరం అదిలాబాద్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి నిర్ణీత ఓవర్లలో 68 పరుగులే చేయగా, ఆరు పరుగుల తేడాతో మెదక్ జట్టు గెలుపొందింది. మూడో మ్యాచ్‌లో ఖమ్మం- కరీంనగర్ జట్లు తలపడ్డాయి. మొదటి బ్యాటింగ్‌కు దిగిన ఖమ్మం జట్టు 12 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. అనంతరం కరీంనగర్ జట్టు ఐదువికెట్లు కోల్పోయి 74 పరుగులే చేయగా, 40 పరుగుల తేడాతో ఖమ్మం జట్టు గెలుపొందింది. నాలుగో మ్యాచ్ నల్లగొండ- అదిలాబాద్ జట్ల మధ్య జరిగింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన అదిలాబాద్ జట్టు 12 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 91 పరుగులు చేయగా, అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నల్లగొండ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసి విజయం సాధించింది. ఐదవ మ్యాచ్‌లో మెదక్- నిజామాబాద్ జట్ల మధ్య జరిగిన పోటీల్లో, నిజామాబాద్ 12 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మెదక్ జట్టు వికెట్ కోల్పోకుండా 60 పరుగులు చేసి గెలుపొందింది. అదేవిధంగా గ్రౌండ్-2 ఇండోర్ స్టేడియంలో జరిగిన మొదటి మ్యాచ్‌లో వరంగల్-రంగారెడ్డి జట్ల మధ్య జరిగిన పోటీలో వరంగల్ జట్టు నిర్ణీత 12 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రంగారెడ్డి జట్టు తొమ్మిది ఓవర్లలో వికెట్ నష్టానికి 113 పరుగులు చేసి గెలుపొందింది. రెండో మ్యాచ్‌లో మహబూబ్‌నగర్- నిజామాబాద్ జట్లు తలపడగా మొదట బ్యాటింగ్‌కు దిగిన నిజామాబాద్ జట్టు 12 ఓవర్లలో 71 పరుగులు చేసి ఆల్ ఔట్ అయింది. అనంతరం మహబూబ్‌నగర్ జట్టు ఒక వికెట్ నష్టానికి 72 పరుగులు చేసి విజయం సాధించింది. మూడో మ్యాచ్‌లో హైదరాబాద్-వరంగల్ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 12 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసింది. అనంతరం వరంగల్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసి గెలుపొందింది.