మగ్గం పని నేర్చుకొని నిలదొక్కుకోవాలి
ABN , Publish Date - Jun 10 , 2026 | 11:15 PM
యూనియన్ ఆర్‌సెటీ ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న శిక్షణ ద్వారా మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ పనులను నేర్చుకొని గ్రామీణ యువతులు, మహిళలు ఆర్థికంగా ఎదగాలని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు సూచించారు.
జోగుళాంబ గద్వాల అదనపు కలెక్టర్ నర్సింగ రావు
ఆర్‌ఎస్‌ఈటీఐలో ఉచిత శిక్షణ ప్రారంభం
గద్వాల టౌన్, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): యూనియన్ ఆర్‌సెటీ ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న శిక్షణ ద్వారా మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ పనులను నేర్చుకొని గ్రామీణ యువతులు, మహిళలు ఆర్థికంగా ఎదగాలని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు సూచించారు. పట్టణంలోని ఆర్‌ఎస్‌ఈటీఐలో బుధవా రం మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ కళలో ఉచిత శిక్షణ నూతన బ్యాచ్ ప్రా రంభించారు. ముఖ్యఅతిథిగా హాజరైన అదనపు కలెక్టర్, నైపుణ్య శిక్షణ పొం దడంతోనే కాకుండా భవిష్యత్‌లో స్వయం సహాయక సంఘాలతో అనుసం ధానమై సూక్ష్మ వ్యాపారవేత్తలుగా విజయ పథంలో దూసుకు పోవాలన్నా రు. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి అవకాశాలను విస్తరింప జేయ డంలో మహిళా సంఘాల పాత్ర కీలకమన్నారు. శిక్షణ అనంతరం పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ ప్రోత్సాహ పథకాలు, సబ్సిడీల ఆధారంగా పారిశ్రామిక అవకాశాల ను అందిపుచ్చుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జన రల్ మేనేజర్ రామలింగేశ్వర గౌడ్, డీఆర్‌డీఏ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీని వాసులు, లీడ్ బ్యాంక్ డిస్ర్టిక్ మేనేజర్ శ్రీనివాస రావు, యూనియన్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ రాముడు, యూనియన్ ఆర్‌సెటీ డైరెక్టర్ డీఎం శ్రీనివాస్ నాయక్ ఉన్నారు.