సర్‌పై అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Aug 30 , 2026 | 11:30 PM
సర్‌పై బీఎల్‌ఏలతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.
- పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
గండీడ్/మహమ్మదాబాద్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి) : సర్‌పై బీఎల్‌ఏలతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం గండీడ్ మండల కేంద్రంలోని రైతు వేదిక, మహమ్మదాబాద్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో బీఎల్‌ఏలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సర్ పేజ్-2 ప్రక్రియపై సమీక్షా సమావేశం నిర్వ హించారు. నోటీసులు వచ్చిన ప్రతీ ఓటరు గుర్తింపు కార్డు, రేషన్, పాన్, ఆధార్, డ్రైవింగ్, పాస్‌పోర్ట్, పదో తరగతి మెమో చూయించి అధికారులతో సరి చేయించే బాధ్యత తీసుకోవాల న్నారు. కాంగ్రెస్‌కు చెందిన ఓట్లు తీసేందుకు బీ జేపీ కుట్ర పన్నుతోందన్నారు. సర్పంచు రాంలాల్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అనంత లక్ష్మారెడ్డి, కేఎం నారాయణ, పీఏసీఎస్ చైర్మన్ శ్రీని వాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శాంతి రంగ్యానాయక్, నాయకులు జితేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, పుల్లా రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్లు ముకుందం, భాషా నాయక్, రాధారెడ్డి, సునిత పాల్గొన్నారు.