ఆటో బోల్తా ఒకరి మృతి
ABN , Publish Date - Jan 22 , 2026 | 11:03 PM
మహ బూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలోని మసిగుం డ్లపల్లి గ్రామం నుంచి వస్తున్న ఆటో కిందపడిం ది. గురువారం జరిగిన ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి.
ముగ్గురికి గాయాలు..
మిడ్జిల్, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): మహ బూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలోని మసిగుం డ్లపల్లి గ్రామం నుంచి వస్తున్న ఆటో కిందపడిం ది. గురువారం జరిగిన ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. మసిగుండ్లపల్లి గ్రామానికి చెందిన రామచంద్రయ్య ఆ టోలో స్పప్న, ఫిర్యా, రాములు, నర్సయ్యలు మిడ్జిల్‌కు వస్తున్నారు. కాటో నిగడ్డతండా స్టేజి సమీపంలో ప్రమాదవశాత్తు ఆటో అదుపుతప్పి కిందప డింది. దీంతో 108 అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను జడ్చర్ల ప్రభుత్వ ఆ స్పత్రికి తరలిస్తుండగా, కొత్తపల్లి గ్రామానికి చెందిన నర్సయ్య (80) మార్గమధ్యలో మృతి చెందాడు. గాయపడిన ముగ్గురికి జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించినట్లు ఎస్‌ఐ శివనాగేశ్వర్‌నాయుడు తెలిపారు. కాగా నర్సయ్య మసిగుండ్లపల్లి గ్రామంలోని తన బంధువైన వెంకటయ్య ఇంటికి వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగినట్లు తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.