Share News

ఆయిల్‌పామ్‌ సాగు లాభదాయకం

ABN , Publish Date - Jul 16 , 2026 | 11:44 PM

ఆయిల్‌పామ్‌ సాగు లాభదాయ కమైన పంటగా నిలుస్తోందని కలెక్టర్‌ హేమంత కేశవ్‌పాటిల్‌ అన్నారు.

ఆయిల్‌పామ్‌ సాగు  లాభదాయకం
ఆయిల్‌పామ్‌ తోటను పరిశీలిస్తున్న కలెక్టర్‌

అచ్చంపేట, జూలై16 (ఆంధ్ర జ్యోతి):ఆయిల్‌పామ్‌ సాగు లాభదాయ కమైన పంటగా నిలుస్తోందని కలెక్టర్‌ హేమంత కేశవ్‌పాటిల్‌ అన్నారు. గురువారం ఆయన నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండ లంలోని లింగోటంలో సాగుచేసిన ఆయిల్‌పామ్‌ తో టను జిల్లా ఉద్యానశాఖ, ఆయిల్‌పామ్‌ కంపెనీ అధికా రులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా తోటలో మొక్కల పెరుగుదల, దిగుబడి, నీటి వినియోగం, నిర్వహ ణ పద్దతులు, కోత విధానాలను పరిశీలించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ లింగోటంలో రైతు రాజశేఖర్‌ గౌడ్‌ సాధించిన విజయం ఇతర రైతులకు ఆదర్శంగా నిలు స్తోందన్నారు. భారత వాతావరణశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఈ ఏడాది వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవచ్చునని, ప్రాజెక్టులలో కూడా నీటి నిల్వలు తాగునీటి అవసరాల కోసమే ఉన్నాయని, రైతులు ఈ విషయాల ను అర్థం చేసుకుని వరికి బదులు ఇతర ప్ర త్యామ్నాయ పంటలు సాగుచేసేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Jul 16 , 2026 | 11:44 PM