Share News

ఒకే ్కసి పువ్వేసి చందమామ...

ABN , Publish Date - Oct 10 , 2026 | 11:54 PM

‘ఒక్కేసి పువ్వేసి చందమామ... ఒక్కజాములా యె చందమామ’... ‘ఏమేమి పువ్వొప్పునే గౌర మ్మ... ఏమేమి కాయప్పునే గౌరమ్మ’... అంటూ పూలపండగ సంబురం మొదలైంది..

 ఒకే ్కసి పువ్వేసి చందమామ...
మహిళల కోలాటాలు

- అట్టహాసంగా ఎంగిలిపూల బతుకమ్మ

- 18న సద్దుల బతుకమ్మ

మహబూబ్‌నగర్‌,అక్టోబరు10(ఆంధ్రజ్యోతి): ‘ఒక్కేసి పువ్వేసి చందమామ... ఒక్కజాములా యె చందమామ’... ‘ఏమేమి పువ్వొప్పునే గౌర మ్మ... ఏమేమి కాయప్పునే గౌరమ్మ’... అంటూ పూలపండగ సంబురం మొదలైంది.. మహిళలు బతుకమ్మ ఆటపాటలతో సందడి చేస్తున్నారు... పాలమూరు అంతటా ఊరూవాడ మహిళలు తీ రొక్కపూలతో బతుకమ్మలు పేర్చి ఆటపాటలతో క నువిందు చేస్తున్నారు. శనివారం ఎంగిలిపూల బతు కమ్మతో సంబురం మొదలైంది. బతుకమ్మ ఈనెల 18న సద్దులబతుకమ్మతో ముగియనుంది. తొలి రోజు మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో బాలుర జూనియర్‌ కళాశాల మై దానంలో ఎంగిలిపూల బతుకమ్మ ఉత్సవాలు అంబరాన్నంటాయి. మహి ళలు బతుకమ్మలతో పెద్దసంఖ్యలో హాజరై సంబురాలలో సందడి చేశారు. నగర మేయర్‌ మమత మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. కమిషనర్‌ రామాంజులరెడ్డి, కార్పొరేటర్‌లు, అధికారులు పాల్గొన్నారు. శనివారం అ మావాస్య సందర్బంగా పితృతర్పణాలు చేసిన అనంతరం పలుచోట్ల బ తుకమ్మ ఉత్సవాలు ప్రారంభించారు. పూల ధరలు గతంతో పోలిస్తే పెరి గాయి. కిలో చేమంతి, గులాబి రూ.400-500 విక్రయిస్తున్నారు.

Updated Date - Oct 10 , 2026 | 11:54 PM