Share News

అడివేశ్వరా.. మొర ఆలకించరా

ABN , Publish Date - Jul 25 , 2026 | 11:08 PM

ఆషాఢ ఏకాదశి సందర్భంగా జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలిలోని ఆలయాల్లో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అడివేశ్వరా.. మొర ఆలకించరా
రాజోలి: తుంగభద్ర నదిలో నుంచి పవిత్ర జలాలను తెస్తున్న భజన భక్తులు

రాజోలి (ఆంధ్రజ్యోతి): ఆషాఢ ఏకాదశి సందర్భంగా జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలిలోని ఆలయాల్లో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని అడివేశ్వరస్వామి ఆలయంలో భజన బృందం వారు భజనలతో ర్యాలీగా వెళ్లి, తుంగభద్ర నదిలో స్నానాలు ఆచరించారు. నదిలో నుంచి పవిత్రజలాన్ని తెచ్చి వర్షాలు సమృద్ధిగా కురిపించాలని కోరుతూ స్వామివారికి అభిషేకం చేశారు. కార్యక్రమంలో అర్చకులు అడివిస్వామి, గోపిఅయ్య, భక్తులు పాల్గొన్నారు. అలాగే కోటవీధిలో కొలువుదీరిన శ్రీ వైకుంఠ నారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

Updated Date - Jul 25 , 2026 | 11:08 PM