Share News

అధికారులు క్షేత్రస్థాయిలో పని చేయాలి

ABN , Publish Date - Oct 08 , 2026 | 11:59 PM

జిల్లాలో రైతుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు అధికారులు క్షేత్ర స్థాయిలో పని చేయాలని రైతు, వ్యవసాయ సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి అన్నారు.

అధికారులు క్షేత్రస్థాయిలో పని చేయాలి
కిసాన్‌మేళాలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ యెన్నం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి

- రైతు, వ్యవసాయ సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి

- ఆధునిక వ్యవసాయంతో రైతులకు భరోసా : ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి

- వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల సాగు : మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ ఖుష్బూగుప్తా

పాలమూరు, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో రైతుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు అధికారులు క్షేత్ర స్థాయిలో పని చేయాలని రైతు, వ్యవసాయ సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి అన్నారు. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని అనంతమారుతి ఫంక్షన్‌ హాలులో గురువారం ఏర్పాటు చేసిన కిసాన్‌మేళాను ఆయన ప్రారంభించారు. అనంతరం విత్తనాలు, వ్యవ సాయ యంత్రాలు, సాంకేతిక పరికరాల స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు యాప్‌ల నిర్వహణ, కార్యాలయాలకే పరిమితం కాకుండా రైతులతో నేరుగా మాట్లాడాలని సూచించారు. ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్లను (ఎఫ్‌పీవో) మరింత బలోపేతం చేయాలన్నారు. ప్రభుత్వ విప్‌ యెన్నం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటేనే వ్యవసాయం లాభసాటిగా మారుతుందన్నారు. కలెక్టర్‌ ఖుష్బూగుప్తా మాట్లాడుతూ వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటలు సాగు చేయాలని సూచించారు. అనంతరం జేడీ కే గోవిందునాయక్‌, డీడీఏ ఎఫ్‌టీసీ బి.వెంకటేశ్‌, జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమల అధికారి కే వేణుగోపాల్‌, జీ నాగరత్న, జిల్లా పశుసంవర్ధక, ప శువైద్య అధికారి శివానందస్వామి, జిల్లా మత్స్యశాఖాధికారి డీ రాధారోహిణి, ఏడీలు రాంపాల్‌, రాజేందర్‌ అగర్వాల్‌, ఏవోపీ శ్రీనివాసులు, శాస్త్రవేత్తలు కె.కళ్యాణి ప్రసంగించారు. కార్యక్రమంలో ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మల్లు నరసింహారెడ్డి, అదనపు కలెక్టర్‌ జేఎల్‌ బీ హరిప్రియ, శాస్త్రవేత్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Oct 08 , 2026 | 11:59 PM