Share News

సీజ్‌ చేసిన దుకాణాలు తెరిచిన అధికారులు

ABN , Publish Date - Oct 14 , 2026 | 11:25 PM

ఈనెల 9వ తేదీ శుక్రవారం అక్రమ నిర్మాణాలు అంటూ మునిసిపల్‌ అధికారులు మూడు వ్యాపార సముదాయ భవనాలను సీజ్‌ చేశారు.

సీజ్‌ చేసిన దుకాణాలు తెరిచిన అధికారులు

అయిజ, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): ఈనెల 9వ తేదీ శుక్రవారం అక్రమ నిర్మాణాలు అంటూ మునిసిపల్‌ అధికారులు మూడు వ్యాపార సముదాయ భవనాలను సీజ్‌ చేశారు. రంగు జనార్దన్‌, తుపతురాల బుడ్డన్నకు చెందిన వా టిని సీజ్‌ చేశారు. ఈ దుకాణ యజమానులు ఇంటి అనుమతులు తీసుకుని వ్యాపార సముదాయాలు నిర్మించారంటూ అందిన ఫిర్యాదుల మేరకు సీజ్‌ చేశారు. బుధవారం ఉదయం అయిజ మునిసిపల్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌రావు, టీపీఓ సాత్విక్‌ మునిసిపల్‌ అధికారులు, సిబ్బంది, ఎస్‌ఐ గురుస్వామితో కలిసి సీజ్‌చేసిన దు కాణాలను తెరిపించారు. ప్రజల ప్రయోజనార్థం కలెక్టర్‌ ఆదేశాల మేరకు దుకాణాలు తెరుచుకు నేందుకు అను మతులు ఇచ్చినట్లు విలేకరులకు తెలిపారు. త దుపరి చర్యలు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తీసుకుంటామన్నారు.

Updated Date - Oct 14 , 2026 | 11:25 PM