గురుకులాల్లో గ్రూప్-1 ట్రైనీ అధికారుల పరిశీలన
ABN , Publish Date - Feb 04 , 2026 | 11:31 PM
కల్వ కుర్తి పట్టణంలోని గిరిజన బాలికల గురుకులాన్ని గ్రూప్-1 ఆఫీసర్ల బృందం పరిశీలించింది.
కల్వకుర్తి, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి) : కల్వ కుర్తి పట్టణంలోని గిరిజన బాలికల గురుకులాన్ని గ్రూప్-1 ఆఫీసర్ల బృందం పరిశీలించింది. శిక్షణలో భాగంగా ఈనెల 2 నుంచి బుధవారం వరకు మూడు రోజుల పాటు గురుకులంలో ప్రిన్సిపాల్ పి.స్వరూప ఆధ్వర్యంలో గ్రూప్-1 ఆ ఫీసర్ల బృందం పరిసరాలను, వసతులను పరి శీలించారు. లోతుగా నిమగ్నమైన, అన్ని తరగ తి గదులను సందర్శించి ఉపాధ్యాయులు, వి ద్యార్థులతో సంభాషించారు. విద్యార్థులు అడిగి న సందేహాలను నివృత్తి చేశారు. ట్రైనీ గ్రూ ప్-1 ఆఫీసర్ల బృందం సభ్యులను ప్రిన్సిపాల్ పి.స్వరూప, ఉపాధ్యాయులు శాలువాలతో స త్కరించారు. అనంతరం విద్యార్థినులు నిర్వ హించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకు న్నాయి. గ్రూప్-1 ట్రైనీ ఆఫీసర్లు రెండు రా త్రులు ఇక్కడే బస చేశార ని ప్రిన్సిపాల్ స్వరూప తె లిపారు. సీనియర్ వైస్ ప్రి న్సిపాల్ టి.ప్రీతి, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ పి.విజయ, పీడీ నిర్మల, పీఈటీ పి.అని త, ఉపాధ్యాయులు, విద్యా ర్థులు పాల్గొన్నారు.
- బిజినేపల్లి, (ఆంధ్ర జ్యోతి) : మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకు ల పాఠశాలను బుధవారం గ్రూప్-1 శిక్షణ అధి కారులు పరిశీలించినట్లు ప్రిన్సిపాల్ సుమతి తెలిపారు. శిక్షణలో భాగంగా రెండు రోజుల పాటు విద్యార్థులతో కలిసి పాఠశాలలోనే ఉండి విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపా యాలు, విద్యాబోధన, తదితర పరిస్థితులను, గురుకులాల పనితీరును తెలుసుకోనున్నట్లు తె లిపారు. మధ్యాహ్నం విద్యార్థులతో కలిసి భో జనం చేసి తరగతుల్లో విద్యాబోధనను పరి శీలించారు.