ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్
ABN , Publish Date - Jan 18 , 2026 | 11:20 PM
తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఎన్టీఆర్ తెలుగువారికి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని తెలుగుదేశం పార్టీ గద్వాల నియోజకవర్గం ఇన్‌చార్జి గంజిపేట రాములు కీర్తించారు.
గద్వాల టౌన్, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఎన్టీఆర్ తెలుగువారికి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని తెలుగుదేశం పార్టీ గద్వాల నియోజకవర్గం ఇన్‌చార్జి గంజిపేట రాములు కీర్తించారు. సమాజమే దేవాలయమని, ప్రజలే దేవుళ్లని నమ్మి రాజకీయ ప్రస్తానం ప్రారంభించిన ఎన్టీఆర్ ప్రజల గుండెల్లె సుస్థిర స్థానం దక్కించుకున్న మహనీ యుడన్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమం త్రి, దివంగత నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం పట్టణంలోని పాతబస్టాండ్ సర్కిల్‌లో దివంగత నాయకుడి విగ్రహం వద్ద టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సం దర్బంగా మాట్లాడిన గంజిపేట రాములు, రాజ కీయాల్లో నిబద్ధతను చాటిన ఎన్టీఆర్ సంక్షేమ పథకాలను ఆద్యుడిగా నిలిచారని, నేడు అన్ని ప్రభుత్వాలు ఆయన మార్గాన్నే అనుసరిస్తుండ టం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో నాయ కులు ఎండీ ఇస్మాయిల్, రవియాదవ్, నాగరాజు, గోపాల్, రవిశంకర్, ఆంజనేయులు, ఉదయకిర ణ్ ఉన్నారు.