Share News

మొదలైన నామినేషన్ల పర్వం

ABN , Publish Date - Jan 28 , 2026 | 11:29 PM

నాగర్‌ క ర్నూల్‌, జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లోని మునిసిపాలిటీల్లో నామినేషన్ల పర్వం ప్రారంభం అయ్యింది.

మొదలైన నామినేషన్ల పర్వం
గద్వాల మునిసిపాలిటీలోని నామినేషన్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌

- మూడు జిల్లాల్లోని 12 మునిసిపాలిటీల్లో 71 నామినేషన్లు దాఖలు

- పర్యవేక్షించిన ఆయా జిల్లాల కలెక్టర్లు

నాగర్‌కర్నూల్‌టౌన్‌/ గద్వాల/ వనపర్తి టౌన్‌, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): నాగర్‌ క ర్నూల్‌, జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లోని మునిసిపాలిటీల్లో నామినేషన్ల పర్వం ప్రారంభం అయ్యింది. రాష్ట్ర ఎన్నికల సం ఘం మంగళవారం షెడ్యూల్‌ను విడుదల చేయడంతో పాటు బుధవారం నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మునిసిపాలిటీల్లో ఎన్నికల కోలాహలం ప్రా రంభం అయ్యింది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 4 మునిసిపాలిటీలు ఉండగా మూడు మునిసి పాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇం దులో అచ్చంపేట మునిసిపాలిటీకి ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడం లేదు. మిగిలిన మూడు మునిసిపాలిటీలలో మొదటిరోజు మొత్తం 32 నామినేషన్లు దాఖలు చేశారు. అదేవిధంగా జోగుళాంబ గద్వాల జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీల్లో మొదటి రోజు 5 నామినేషన్లు దాఖలు చేశారు. వనపర్తి జిల్లా లోని 5 మునిసిపాలిటీల్లో మొదటి రోజు 34 నామినేషన్లు దాఖలు అయ్యాయి. నామినేష న్ల ప్రక్రియను కలెక్టర్లు పరిశీలించారు.

Updated Date - Jan 28 , 2026 | 11:29 PM