Share News

మొదలైన నామినేషన్ల పర్వం

ABN , Publish Date - Jan 28 , 2026 | 11:28 PM

మునిసిపల్‌ ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణ సందడి షురూ అయ్యింది. మహబూబ్‌నగర్‌, నారాయణపేట జి ల్లాల్లో బుధవారం పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

మొదలైన నామినేషన్ల పర్వం
పాలమూరు కార్పొరేషన్‌ 49వ వార్డు నుంచి నామినేషన్‌ దాఖలు చేస్తున్న ప్రసన్నఆనంద్‌ కుమార్‌గౌడ్‌

తొలిరోజు పాలమూరు జిల్లాలో 14..

నారాయణపేటలో 18 దాఖలు

పాలమూరు కార్పొరేషన్‌లో 9..

మహబూబ్‌నగర్‌, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణ సందడి షురూ అయ్యింది. మహబూబ్‌నగర్‌, నారాయణపేట జి ల్లాల్లో బుధవారం పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మునిసిపాలిటీలలో 14 నా మినేషన్లు దాఖలు కాగా, నారాయణపేట జిల్లాలో 18 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ జిల్లాలోని మద్దూరు పురపాలికలో ఇంకా బోణీ కాలేదు. మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో 9, దేవరకద్ర మునిసిపాలిటీలో 4, భూత్పూర్‌ మునిసిపాలిటీలో ఒక నామినేషన్‌ దాఖలైంది. అదేవిధంగా నారాయణపేట జిల్లాలోని నా రాయణపేట మునిసిపాలిటీలో 2, మక్తల్‌లో 4, కోస్గిలో 12 నామినేషన్లు వచ్చాయి. రెండు జిల్లా ల్లో కలిపి 32 నామినేషన్లు దాఖలయ్యాయి. తొలిరోజు మందకొడిగా సాగగా గురు, శుక్ర వారాల్లో అ ధికంగా నామినేషన్లు దాఖలు కానున్నాయి. ఇంకా ప్రధాన పార్టీల్లో అభ్యర్థులు ఖరారు కానందున నామినేషన్లు వేయడానికి ముందుకు రాలేదు. చాలామంది టికెట్‌ల కోసం నాయకుల ఇళ్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. టికెట్‌ ఖరారు చేసుకుని బీఫామ్‌, ముహూర్త బలం చూసుకుని నామినేషన్‌ వేయాలనే ప్రయత్నంలో చాలామంది ఆశావహులు ఉన్నారు.

20 కౌంటర్లు ఏర్పాటు

పాలమూరు కార్పొరేషన్‌ పరిఽధిలో నామినేషన్ల కోలాహలం మొదలైంది. తొలి రోజు 9 నామినేషన్‌లు దాఖలయ్యాయి. 60 డివిజన్‌లకు నామినేషన్ల స్వీకరణ కోసం 20 కౌంటర్లు ఏర్పాటుచేశారు. మూడు వార్డులకు ఒక కౌంటర్‌ చొప్పున ఏర్పాటు చేశారు. నామినేషన్లకు మరో రెండురోజులు మాత్రమే గడువు ఉంది. నేడు, రేపు పెద్దఎత్తున దాఖలు కానున్నాయి. అందుకోసం యంత్రాంగం ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తొలిరోజు 49వ వార్డు నుంచి మేయర్‌బరిలో ఉన్న ప్రసన్నఆనంద్‌ కుమార్‌గౌడ్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. కాంగ్రెస్‌ నాయకులు, అనుచరులతో ర్యాలీగా వచ్చి నామినేషన్‌ వేశారు. పాలమూరు కార్పొరేషన్‌లో నామినేషన్‌ కౌంటర్లను కలెక్టర్‌ విజయేందిర బోయి, ఎన్నికల పరిశీలకులు కాత్యాయని దేవి పరిశీలించారు. ఏర్పాట్లలో లోపం ఉండొద్దని అధికారులకు సూచించారు.

Updated Date - Jan 28 , 2026 | 11:28 PM