నామినేట్.. లేట్..!
ABN , Publish Date - Nov 22 , 2026 | 11:35 PM
నామినేటెడ్ పదవులపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఇంకా ఆసక్తి తగ్గలేదు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు కొన్ని శాఖల్లోని నామినేటె డ్ పోస్టులను అసలే భర్తీ చేయకపోగా.. గతం లో భర్తీ చేసినవి (పదవులు) కూడా ఎప్పుడో గ డువు ముగిశాయి. అవసరాన్ని బట్టి కొందరికి మాత్రమే రెన్యువల్ అవకాశం రాగా.. మరికొందరికి ఇంకా రెన్యువల్ కాలేదు.
- నామినేషన్ పద్ధతిలో సొసైటీ ఎంపికలపై కోర్టు బ్రేకులు
- ఎమ్మెల్యేలపై పెరుగుతున్న ఒత్తిడి.. సీఎం వద్ద వినతులు
- కొన్ని పదవులకు గడువు తేదీ లేకుండానే గతంలో ఆర్డర్లు
- నామినేటెడ్ ఆలస్యమవుతుండటంతో పార్టీ పదవుల ఎర
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మహబూబ్‌నగర్
నామినేటెడ్ పదవులపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఇంకా ఆసక్తి తగ్గలేదు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు కొన్ని శాఖల్లోని నామినేటె డ్ పోస్టులను అసలే భర్తీ చేయకపోగా.. గతం లో భర్తీ చేసినవి (పదవులు) కూడా ఎప్పుడో గ డువు ముగిశాయి. అవసరాన్ని బట్టి కొందరికి మాత్రమే రెన్యువల్ అవకాశం రాగా.. మరికొందరికి ఇంకా రెన్యువల్ కాలేదు. అలాగని ఆ పదవి ని వెరొకరికి కేటాయించనూ లేదు. ప్రభుత్వం ఏ ర్పడి మూడేళ్లు దాటడంతో పలు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతుండటంతో ఈ పదవుల కు కూడా మోక్షం లభిస్తుందనే ఆశలు కాంగ్రెస్ శ్రేణుల్లో కలుగుతున్నాయి. కొత్త పథకాలు, నిధు ల విడుదలతో ఎమ్మెల్యేలు సంతోషంగా ఉన్నప్పు డే తమ అర్జీలను ముందుంచి పదవులు దక్కించుకోవాలనే ఆశలో నాయకులు ఉన్నారు. ఇప్పటికే జిల్లాస్థాయి పోస్టుల విషయంలో ఎమ్మెల్యే ల మధ్య పోటీ వాతావరణం ఉండగా.. నియోజకవర్గం, మండల స్థాయి పోస్టుల్లో ఎలాంటి ఇ బ్బంది లేదు. ఉదాహరణకు మహబూబ్‌నగర్ జిల్లాలో ఏ నామినేటెడ్ పోస్టు భర్తీ చేయాలన్నా ముగ్గురు ఎమ్మెల్యేలు తమ అభ్యర్థులను ముం దుపెడుతున్నారు. దీనివల్ల కూడా కొన్ని పోస్టుల భర్తీ ముందుకు సాగడం లేదనే విమర్శలు ఉ న్నాయి. అయితే, ఎన్నికలకు ఇంకా రెండేళ్లు స మయం ఉన్నప్పటికీ.. ఈ సంవత్సరం కొన్ని పో స్టులను తమవారికి ఇప్పించుకుంటేనే రెండేళ్లు వారు పదవిని అనుభవిస్తారు... అందుకే ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెరుగుతోంది. వారు సీఎంను క లిసినప్పుడల్లా తమ అనుచరులకు నామినేటెడ్ పదవులపై వినతులు ఇస్తూనే ఉన్నారు. అయితే నామినేటెడ్ పోస్టుల విషయంలో తాత్సారంపై శ్రేణుల్లో అసంతృప్తి మాత్రం విపరీతంగా ఉంది. ఉన్న పోస్టులను భర్తీ చేయరు.. గడువు ముగిసిన వాటిని రెన్యువల్ చేయరు అనే గులగడం కనిపిస్తోంది.
చాలామంది ఆశావహులు...
ఉమ్మడి జిల్లాలో రాష్ట్రస్థాయి నామినేటెడ్ పో స్టులు ఆశించేవారు చాలామంది ఉన్నారు. ప్ర స్తుతం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఒబేదుల్లా కొత్వాల్, షీప్స్‌్క్షగోట్స్ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్‌పర్సన్‌గా సరిత తిరుపతయ్య, వాల్మీకి బోయ సహకార కార్పొరేషన్ చైర్మన్‌గా గట్టు తిమ్మప్ప, రైతు కమిషన్ సభ్యుడిగా కేవీఎన్ రెడ్డి ఉన్నారు. పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా గురునాథ్‌రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్‌గా శివసేనారెడ్డి ఉన్నారు. అయితే, ఇందులో కొంతమంది పదవీకాలం కూడా ముగిసింది. అ యినప్పటికీ వారే ఇప్పటికీ వ్యవహారాలను పరిశీలిస్తున్నారు. వనపర్తి డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న శివసేనారెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్ తిరిగి తమ ప దవులను ఆశిస్తున్నారు. గట్టు తిమ్మప్ప, సరిత తిరుపతయ్యలాంటి వారికి ఇంకా పదవీకాలం ఉంది. బీసీ కమిషన్ సభ్యుడిగా కావాలని కాంగ్రె స్ నేత, బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాలా యుగంధర్‌గౌడ్ చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ఆయనకు ఎన్నికల సమయంలోనే స్పష్టమైన హామీ ఇచ్చినా మూడేళ్లుగా పట్టించుకోవ డం లేదని తెలుస్తోంది. మక్తల్‌కు సంబంధించి న నాగరాజుగౌడ్, దేవరకద్రకు చెందిన అరవింద్‌రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే సోదరుడు దుష్యంత్‌రెడ్డి, నాగర్‌కర్నూలు జిల్లాలోని పలువురు నాయకులు నామినేటెడ్ పోస్టులను ఆశిస్తున్నారు. ఎ న్నికలకు ఇంకా రెండేళ్లు మాత్రమే సమయం ఉండటం, పదేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలో కి వచ్చిన తర్వాత కూడా నామినేటెడ్ పదవులపై తాత్సారం చేయడంతో తమకు నష్టం జరుగుతోందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేయాల్సిన తమను ఇబ్బంది పెట్టడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, కొందరు ఎమ్మెల్యేలు నామినేటెడ్ పోస్టుల విషయం సీఎం, అధిష్టానం కోర్టులో ఉండటంతో తమ నేతలకు పార్టీ అధికార ప్రతినిధి పోస్టులను ఇప్పించాలని తాపత్రయ పడుతున్నట్లు సమాచారం. కానీ అధికార ప్రతినిధి పోస్టులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాగుంటాయని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పోస్టుల్లో ఉండటం వల్ల ప్రభుత్వాన్ని డిఫెండ్ చేయడం తప్పా తమకు ఎలాంటి ప్రయోజనం ఉండదనే అభిప్రాయంలో ఉన్నట్లు తెలుస్తోంది.
గడువే లేకుండా ఉత్తర్వులు...
సాధారణంగా ఏ నామినేటెడ్ పోస్టులను భ ర్తీ చేసినా ఎప్పటి నుంచి ఎప్పటివరకు వారు ఆ పదవిలో ఉంటారో స్పష్టంగా తెలియజేస్తారు. రాష్ట్రస్థాయి నామినేటెడ్ పోస్టులకు రెండేళ్ల పదవీకాలం ఉంటుంది.. అంతకంటే ఎక్కువగా ఇ వ్వాలంటే ఉత్తర్వుల్లో పేర్కొనాలి. ఒకవేళ వారినే కొనసాగించాలంటే రెన్యువల్ ఉత్తర్వులు ఇవ్వా ల్సి ఉంటుంది. కానీ ఉమ్మడి జిల్లాలో కొందరికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చే సమయంలో గడువు ఎంతవరకో అందులో తెలపకుండానే ఉత్తర్వులు ఇచ్చినట్లు సమాచారం. ఉదాహరణకు మహబూబ్‌నగర్ అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ (ముడా) చైర్మన్ పదవీకాలం రెండేళ్లపాటు ఉం టుంది. కానీ లక్ష్మణ్‌యాదవ్ ముడా చైర్మన్‌గా ఎన్నికై.. రెండేళ్లు దాటింది. ఇక్కడ కొత్తవారిని భ ర్తీచేయలేదు. అయితే ఆయనకు ఇచ్చిన ఉత్తర్వు ల్లో రెండేళ్లని లేదా ఈ గడువు వరకు పదవిలో కొనసాగుతారని ఎక్కడా పేర్కొనలేదని సమాచారం. ఆయనతో పాటు గ్రంథాలయ సంస్థ చై ర్మన్ మల్లు నర్సింహారెడ్డి ఉత్తర్వుల్లోనూ గడువు పేర్కొనలేదు. ఆయన పదవీకాలం కూడా ముగిసింది. అలాగే ఇటీవల నామినేటెడ్ పద్ధతిలో భర్తీ చేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు చైర్మన్లు, డైరెక్టర్ల పోస్టులకు కూడా గడువును పేర్కొనలేదు. అయితే ఆ పోస్టుల విషయం కోర్టు బ్రేకులు వేసిన విషయం తెలిసిందే. పీఏసీఎ్‌సల పోస్టులతో ఏర్పడే డీసీసీబీ చైర్మన్ పదవిని దక్కించుకుందామనుకునే వా రు కూడా చాలామందే ఉన్నా.. అది కూడా సం దిగ్ధంలో పడింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల ఎన్నికలు లేకపోవడం, పీఏసీఎ్‌సల ఎన్నిక ప్ర క్రియ ఏమవుతుందో తెలియకపోవడం, కొన్ని పోస్టుల గడువు ముగియడం, కొన్ని ఎప్పుడు ముగుస్తాయో ఉత్తర్వుల్లో పేర్కొనకపోవడం, ఖాళీగా ఉన్నవాటిని ఎప్పుడు భర్తీ చేస్తారో తెలియకపోవడంతో శ్రేణులు నారాజ్‌లో ఉన్నాయి.