వరి వద్దు....!
ABN , Publish Date - Oct 13 , 2026 | 11:48 PM
ఎల్‌నినో ప్రభావంతో పంటల విస్తీర్ణం తగ్గ డంతో పాటు.. వేసిన పంటలు ఎండిపోవడం, సమయానికి తడులు అందించకపోవడంతో ది గుబడి కూడా భారీగా తగ్గే అవకాశాలు కనిపి స్తున్నాయి.
- యాసంగిలో సాగు చేయొద్దని వ్యవసాయ శాఖ సూచనలు
- గతేడాది ఉమ్మడి జిల్లాలో 8.53 లక్షల ఎకరాల్లో వరి సాగు
- 13.89 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడిని కోల్పోయే పరిస్థితి
- ప్రాజెక్టుల్లో ఉన్న నీరు తాగునీటి అవసరాల కోసం వినియోగం
- పప్పులు, కూరగాయలు, నూనెగింజల పంటలకు ప్రోత్సాహం
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మహబూబ్‌నగర్
ఎల్‌నినో ప్రభావంతో పంటల విస్తీర్ణం తగ్గ డంతో పాటు.. వేసిన పంటలు ఎండిపోవడం, సమయానికి తడులు అందించకపోవడంతో ది గుబడి కూడా భారీగా తగ్గే అవకాశాలు కనిపి స్తున్నాయి. వానాకాలంలోనే ఎక్కువ నీటి అవసరం ఉండే వరి వద్దన్నప్పటికీ.. ఎగువ నుంచి వరద రావడంతో రైతులు నీరందుతుందని ఆశతో సాగును చేపట్టారు. ఆ పంటలకు నీటి విషయంలోనే ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో గందరగో ళ పరిస్థితి నెలకొంది. వారబందీ ప్రకారం నీరి చ్చి.. పంటలను గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తాగునీటి అవసరాలకు ఇబ్బంది లేకుండా కర్ణాటక నుంచి నీటి విడుదలకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం ఉమ్మడి పాలమూరు జిల్లాలో వానాకాలం వరి ఇంకా కోతలకు రాలేదు. ఈసారి ముందస్తుగా రైతులను అప్రమత్తం చేసేందుకు వ్యవసాయశాఖ సిద్ధమవుతోంది. యాసంగి సీజన్‌లో వరి సాగును నియంత్రించాలని రైతులకు సూచిస్తోంది. బదులుగా పప్పుశనగ, మినుము, పెసర, బెబ్బర్ల వంటి పప్పు దినుసులు, వేరుశనగ, నువ్వులు, పొద్దు తిరుగుడు వంటి నూనె గింజలతోపాటు కూరగాయల సాగును ప్రోత్సహించాలని భావి స్తోంది. అయితే ఉమ్మడి జిల్లాలో గద్వాల జిల్లాలో పప్పుశనగ సాగు ఎక్కువగా జరుగుతుంది. గతేడాది కొంత తగ్గినా.. ఈ ఏడాది పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ నీటి అవసరం లేకుండా మంచుతో పండే పంట కావడం, నల్ల రేగడి నేలలు అధికంగా ఉండటం కలిసి రానుంది. వనపర్తి, నాగర్‌కర్నూలు జిల్లాల్లో వేరుశనగ, మినుముల సాగు అధికంగా ఉంది. దాన్ని డబుల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్నేళ్లు గా వేరుశనగ స్థానాన్ని మినుము, వరి భర్తీ చేస్తుండగా.. ఈ ఏడాది ఈ పంటల సాగులో స మతుల్యత తీసుకురావాల్సిన అవసరం ఉంది. మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలో కూ డా వేరుశనగ సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఇక అన్ని జిల్లాల్లో కూరగాయల సాగు చాలా తక్కువ విస్తీర్ణంలో జరుగుతోంది. జి ల్లా అవసరాలకు కూడా రాయలసీమ జిల్లాలతో పాటు కర్ణాటక నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది.
బోర్లున్నా కష్టమే..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో యాసంగిలో కాలువల కింద నీరు విడుదల దాదాపు కష్టమే.. అయితే వరద వచ్చినప్పుడు చెరువుల్లో నీటిని నింపడం వల్ల భూగర్భజలాలు పైనే ఉండి.. బోర్లు, బావుల ద్వారా వరిసాగు ఎక్కు వగా జరిగేది. కానీ ఈసారి చెరువుల్లో నీరు లేకపోవడం.. భూగర్భజలాలు లోలోతుకు వెళ్లిపోతుండటంతో యాసంగిలో బోర్లున్నా వరి సాగు కష్టతరంగానే ఉంటుంది. ఒకవేళ పొలం పారుతుందని సాగు చేసినా.. పంట చివరి వ రకు తడులు ఇవ్వడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. గతేడాది యాసంగిలో ఉమ్మడి జిల్లాలో 8.53 లక్షల ఎకరాల్లో వరిసా గు జరిగింది. ఇందులో వనపర్తి జిల్లాలో అత్యధికంగా సాగైంది. నీరు పుష్కలంగా ఉండటం తో దాదాపు 13.89లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. కొంతమేర ప్రైవేటు మార్కెట్‌కు వెళ్లినా.. మెజారిటీ ధాన్యం ప్రభుత్వం సేకరిం చింది. ఇప్పుడు యాసంగిలో ఆ దిగుబడిని కోల్పోయే అవకాశం ఉంది. ఎక్కువ శాతం పీడీఎస్ అవసరాలు తీరుతుండగా.. పంపిణీలో అవంతరాలు ఏర్పడుతాయా? అనే సందేహాలు ఉన్నాయి. అయితే బఫర్ స్టాక్ ఉండటంతో ఇబ్బందులు ఉండవని, కానీ సన్నబియ్యం పంపిణీలో అవాంతరాలు ఏర్పడొచ్చని అధికారులు చెబుతు న్నారు. ఇక ప్రాజెక్టుల విషయానికి వస్తే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రస్తుతం జూరాలలో ఉన్న నీరు ఈ సీజన్‌కు కొంత విడుదల చేస్తున్నప్పటికీ.. పంట చేతికి వచ్చిన తర్వాత ఉన్న నీటి నిల్వలను పూర్తిగా తాగునీటి అవ సరాల కోసమే ఉంచనున్నారు. శ్రీశైలం నుంచి నీటి ఎత్తిపోతలు కొనసాగుతుండగా.. పాలమూరు- రంగారెడ్డి మోటార్ల ద్వారా కూడా నీటిని విడుదల చేయనున్నారు. దీనిద్వారా 12 డబ్ల్యూటీపీల ద్వారా 4 వేల ఆవాసాలకు, 18 మునిసిపాలిటీలకు తాగునీరు అందించాల్సి ఉంటుంది. కాబట్టి యాసంగి సాగుకు నీటి ఎత్తిపోతల సాధ్యం కాదు. ప్రస్తుతం ఉన్న నీటినే వానాకాలం పంటలకు విడుదల చేసుకోలేని పరిస్థితులు ఉన్నాయి.
కూరగాయల కొరత..
నిత్యావసరాల అత్యంత కీలకమైనవి కూరగాయలు.. ఒక్కో వ్యక్తికి కనీసం రోజుకు 300 గ్రాముల కూరగాయలు అవసరం ఉంటుంది. కానీ అంతమేర ఉమ్మడి జిల్లాలో ఉత్పత్తి లేదు. కేవలం 12 వేల ఎకరాల్లో మాత్రమే కూ రగాయలు సాగవుతుండగా.. అవసరంలో కనీసం 50 శాతం అవసరాలను కూడా ఉమ్మడి జిల్లాలో అయిన ఉత్పత్తి ద్వారా తీర్చలేని పరిస్థితి ఉంది. కూరగాయల సాగుకు అనుకూలమైన ఎర్ర నేలలు పుష్కలంగా ఉన్నప్పటికీ.. సాగునీటి వనరుల లభ్యత పెరిగిన త ర్వాత వరి వైపు మళ్లించి ఆరుతడి పంటలను తగ్గించేస్తున్నారు. కూరగాయల సాగుకు ప్రధానంగా శ్రమ అవసరం.. వరి, ఇతర ఆరుతడి పంటలకు అంత శ్రమ ఉండదు. అ లాగే కూలీల అవసరం, ధరలు కూడా సాగుపై ప్రభావం చూపుతాయి. ఉమ్మడి జిల్లాలో గతేడాది అంచనాల ప్రకారం 12,577 ఎకరా ల్లో వివిధ కూరగాయల పంటలు సాగు చేశారు. దాదాపు 22,098 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. కానీ ఇది ఉమ్మడి జిల్లా అవ సరాల్లో 40 శాతం కూడా కాదు. స్థానికంగా కూరగాయల సాగును ప్రోత్సహిస్తే సామా న్యులకు ధరలు అందుబాటులో ఉండటంతో పాటు రైతులు లబ్ధి పొందే అవకాశం ఉంది. అయితే వరి, ఇతర పంటలకు అలవాటైన రైతులను ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేసి ప్రోత్సహించడం ద్వారా కూరగాయల సాగు పెంచుకోవచ్చు. అందుకు హార్టికల్చర్, అగ్రిక ల్చర్ అధికారులు సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అవసరం అవుతుంది. ఇప్పటికే పూర్తిస్థాయిలో హార్టికల్చర్ అధికారులు అందుబాటులో లేరు. అగ్రికల్చర్ అధికారులకు పంటల నమోదు, సర్వేలతోనే సరిపోతోంది. వారిని పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది.