Share News

గద్వాల డయాలసిస్‌ కేంద్రాన్ని పరిశీలించిన నిమ్స్‌ డాక్టర్లు

ABN , Publish Date - Jan 07 , 2026 | 11:22 PM

జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆ సుపత్రిలోని డయాలసిస్‌ వార్డును నిమ్స్‌ డాక్ట ర్లు బుధవారం పరిశీలించారు.

గద్వాల డయాలసిస్‌ కేంద్రాన్ని పరిశీలించిన నిమ్స్‌ డాక్టర్లు
గద్వాల జిల్లా ఆస్పత్రిలో పేషెంట్‌తో మాట్లాడుతున్న నిమ్స్‌ డాక్టర్లు

గద్వాల న్యూటౌన్‌, జనవరి 7(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆ సుపత్రిలోని డయాలసిస్‌ వార్డును నిమ్స్‌ డాక్ట ర్లు బుధవారం పరిశీలించారు. ఈసందర్భం గా డయాలిసిస్‌ సేవలపై పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. ప్రతీ పేషెంట్‌కు సంబంధిం చి రిపోర్ట్‌, వారి కండీషన్లను తెలుసుకున్నారు. కార్యక్రమంలో నిమ్స్‌ నెఫ్రాలిజిస్ట్‌(డాక్టర్లు)డాక్టర్‌ పాయల్‌, డాక్టర్‌ అభినయ డయాలసిస్‌ క్లస్టర్‌ మేనేజర్‌ సగ్మతుల్లా, డయాలసిస్‌ ఇన్‌ చార్జి నర్సింహ ఉన్నారు.

అలంపూర్‌ : అలంపూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న డయాలసిస్‌ కేంద్రాన్ని బుధవారం నిమ్స్‌ నెఫ్రాలజీ డాక్టర్‌ బృందం సందర్శించింది. ఆసుపత్రి పరిసరాలను పరిశీ లించి, రికార్డులను తనిఖీ చేశారు. పేషెంట్లతో మాట్లాడి డయాలసిస్‌ సేవలను తెలుసుకున్నా రు. కార్యక్రమంలో నర్సింగ్‌ సూపర్‌వైజర్‌ శ్రీలత, డయాలసిస్‌ ఇన్‌చార్జి మహేశ్‌ కుమార్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2026 | 11:22 PM