ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి
ABN , Publish Date - Nov 01 , 2026 | 11:30 PM
నారా యణపేట మునిసిపల్ పా ర్కు వద్ద 20 రోజులుగా కొన సాగుతున్న ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరవ ధిక సమ్మె రిలే దీక్షా శిబిరా న్ని ఆదివారం ఎంపీ డీకే అరుణ సందర్శించి, మద్దతు తెలిపారు
- ఎంపీ డీకే అరుణ
- కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మెకు మద్దతు
నారాయణపేట, నవం బరు 1 (ఆంధ్రజ్యోతి): నారా యణపేట మునిసిపల్ పా ర్కు వద్ద 20 రోజులుగా కొన సాగుతున్న ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరవ ధిక సమ్మె రిలే దీక్షా శిబిరా న్ని ఆదివారం ఎంపీ డీకే అరుణ సందర్శించి, మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని విమర్శించా రు. ఏడు రాష్ట్రాల్లో ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉద్యోగులను రెగ్యులర్ చేయడంతో పాటు సకాలంలో వేత నాలు అందించాలని సూచించారు. బీజేపీ కార్య వర్గ సభ్యుడు రతంగ్‌పాండురెడ్డి, జిల్లా అధ్యక్షు డు సత్యయాదవ్ తదితరులున్నారు.