Share News

నెట్‌బాల్‌ చాంపియన్‌ మహబూబ్‌నగర్‌

ABN , Publish Date - Feb 23 , 2026 | 11:28 PM

జిల్లా క్రీడాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సీఎం కప్‌ పోటీలు విజయవంతంగా ముగిశాయి.

నెట్‌బాల్‌ చాంపియన్‌ మహబూబ్‌నగర్‌
విజేత మహబూబ్‌నగర్‌ బాలుర జట్టుకు ట్రోఫీ అందిస్తున్న ఏఎస్పీ రత్నం, ఉమ్మడి జిల్లా ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్‌

- రన్నర్‌గా నిలిచిన నారాయణపేట, మేడ్చల్‌

- మూడో స్థానంలో ఖమ్మం-నిజామాబాద్‌, నల్గొండ-కామారెడ్డి

- విజేతలకు బహుమతుల ప్రధానం చేసిన ఏఎస్పీ రత్నం

- ముగిసిన రాష్ట్రస్థాయి సీఎం కప్‌ పోటీలు

మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి) : జిల్లా క్రీడాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సీఎం కప్‌ పోటీలు విజయవంతంగా ముగిశాయి. పట్టణంలోని డీఎస్‌ఏ స్టేడియంలో సోమవారం జరిగిన నెట్‌బాల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో బాల, బాలికల విభాగంలో మహబూబ్‌నగర్‌ జట్లు చాంపి యన్‌గా నిలిచాయి. బాలుర విభాగంలో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్‌ జట్టు 20-14 పా యింట్లతో నారాయణపేట జట్టుపై, బాలికల విభాగంలో మహబూబ్‌నగర్‌ జట్టు 23-18 పాయింట్లతో మేడ్చల్‌పై విజేతగా నిలిచాయి. నారాయణపేట (బాలురు), మేడ్చల్‌ (బాలికలు) జట్లు రన్నర్‌గా నిలిచాయి. మూ డో స్థానంలో నల్గొండ - నిజామాబాద్‌ (బా లుర), ఖమ్మం - నిజామాబాద్‌ (బాలికల) జట్లు జాయింట్‌ విన్నర్లుగా నిలిచాయి.

నిరంతర సాధన అవసరం : ఏఎస్పీ రత్నం

నిరంతర సాధనతోనే క్రీడల్లో రాణించవచ్చని అదనపు ఎస్పీ రత్నం అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా స్టేడియంలో సోమవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి సీఎం కప్‌ నెట్‌బా ల్‌ టోర్నీ ముగింపు కార్యక్రమానికి ఆయనతో పాటు, ఒలింపిక్‌ సంఘం ఉమ్మడి మహబూ బ్‌నగర్‌ జిల్లా అధ్యక్షుడు ఎన్‌పీ వెంకటేశ్‌ ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహు మతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ క్రీడల్లో గ్రామీణ క్రీడా కారులు ప్రతిభచాటాలన్నారు. ఎన్‌పీ వెంక టేశ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందన్నారు. గ్రామీణ యువ తను అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు సీఎం కప్‌ పోటీలు నిర్వహి స్తోందని తెలిపారు. కార్యక్రమంలో డీవైఎస్‌వో శ్రీనివాస్‌, నెట్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు విక్రమాదిత్యరెడ్డి, క్రీడా సంఘాల ప్రతినిధులు రాము, చెన్నవీరయ్య, రమేశ్‌, వేణుగోపాల్‌, బాల్‌రాజ్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ రవీందర్‌రెడ్డి, పీడీలు, కోచ్‌లు పాల్గొన్నారు.

Updated Date - Feb 23 , 2026 | 11:28 PM