Share News

గద్వాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం

ABN , Publish Date - Jan 09 , 2026 | 11:43 PM

ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బంది నిర్లక్ష్యానికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతున్నారు. మహిళకు కాన్పు చేసిన తర్వాత రక్తస్రావం కాకుండా ప్యాడ్‌ను ఏర్పాటు చేయడం, మళ్లీ దాన్ని తొలగించాల్సి ఉండగా మరిచిపోయారు.

గద్వాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం

- ప్రసవం తర్వాత ప్యాడ్‌ను తీయని వైనం

- కడుపునొప్పి పెరగడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డ మహిళ

- గుట్టుచప్పుడు కాకుండా చికిత్స చేసిన వైద్యులు

గద్వాల క్రైం, జనవరి 9 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బంది నిర్లక్ష్యానికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతున్నారు. మహిళకు కాన్పు చేసిన తర్వాత రక్తస్రావం కాకుండా ప్యాడ్‌ను ఏర్పాటు చేయడం, మళ్లీ దాన్ని తొలగించాల్సి ఉండగా మరిచిపోయారు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి బాధిత మహిళ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి ఈనెల 4న గద్వాల జిల్లాకు చెందిన ఓ గర్భిణి రెండవ కాన్పు ని మిత్తం వచ్చింది. అదే రోజు రాత్రి 8.55 గంటలకు ప్రసవం చేయగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రసవం తర్వాత రక్తస్రావం కాకుండా ఉండేందుకు ప్యాడ్‌ను ఎఫ్‌ఎన్‌వో, ఇద్దరు నర్సులు ఏర్పాటు చేశారు. కాగా రక్తస్రావం తగ్గాక దాన్ని తొలగించడం మాత్రం మరిచారు. దీంతో ఆ ప్యాడ్‌ అలాగే లోపలికి వెళ్లింది. అప్పటి వరకు బాగానే ఉన్నా.. ఆమెకు కడుపునొప్పి క్రమక్రమంగా పెరిగిం ది. శుక్రవారం కడుపునొప్పి భరించలేనంతగా రావడంతో వైద్యులు పరిశీలించి, లోపల ఉన్న ప్యాడ్‌ను తీసివేశారు. ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా చూ డాలని ఓ అధికారి వైద్యులకు సూచించినట్లు సమాచారం. ఈ విషయంపై జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఇందిరను ఆంధ్రజ్యోతి వివరణ కోరగా.. ఈ ఘట నపై పూర్తిస్థాయిలో విచారించి బాఽఽధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - Jan 09 , 2026 | 11:43 PM