ఎత్తిపోతల పథకాలపై నిర్లక్ష్యం
ABN , Publish Date - Jul 12 , 2026 | 11:44 PM
కోయిల్‌సాగర్ - పేరూర్ ఎత్తిపోతల పథ కాన్ని వెంటనే పూర్తి చేయాలని ఏఐయూకేఎస్ జిల్లా అధ్యక్షుడు రామచం దర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దేవరకద్ర, జూలై 12 (ఆంధ్రజ్యోతి): కోయిల్‌సాగర్ - పేరూర్ ఎత్తిపోతల పథ కాన్ని వెంటనే పూర్తి చేయాలని ఏఐయూకేఎస్ జిల్లా అధ్యక్షుడు రామచం దర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆది వారం మండల కమిటీ ఆధ్వర్యంలో పట్ట ణంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకం చేపట్టి దాదాపు 20 ఏళ్లు అవుతున్నా ఇ ప్పటి వరకు గత ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వం కాలువల నిర్మాణాలు చేయకపోవడంతో సాగు నీరు అందడం లేదన్నారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురువకపోవడంతో రైతు లు సతమతమవుతున్న సమయంలో ప్రభు త్వం ప్రత్యామ్నయ చర్యలు తీసుకోవడం లేద న్నారు. అదేవిధంగా కౌకుంట్ల మండలంలోని పేరూర్ ఎత్తిపోతల పథకం ద్వారా రావలసిన సాగునీటిని నేటికి పరిష్కరించకపోవడం సిగ్గు చేటన్నారు. కోయిల్‌సాగర్- పేరూర్ పథకం ఎ త్తిపోతల పఽథకం ద్వారా రావాల్సిన నీటిని వచ్చే వరకు రైతులతో కలిసి పోరాటం చేస్తామన్నా రు. సమావేశంలో కొండారెడ్డి, కృష్ణ, రాము, దేవదానం, సాంబశివుడు పాల్గొన్నారు.