దేశ రక్షణే మోదీ ఎజెండా
ABN , Publish Date - Oct 07 , 2026 | 11:31 PM
అభివృద్ధి, సంక్షేమం, భారతదేశ రక్షణే ప్రధాని నరేంద్రమోదీ ప్రధాన ఎజెండా అని ఎ మ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి అన్నారు.
- సాంకేతిక రంగంలో సమగ్రాభివృద్ధికి కృషి
- వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి
నారాయణపేట క్రైం, అక్టోబరు 7 (ఆంధ్ర జ్యోతి): అభివృద్ధి, సంక్షేమం, భారతదేశ రక్షణే ప్రధాని నరేంద్రమోదీ ప్రధాన ఎజెండా అని ఎ మ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్పయాత్రకు ఆయన ము ఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు చమురు ఉ త్పత్తులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండేదని కానీ టెక్నాలజీని ఉపయోగించుకొని దేశంలో ఎలక్ర్టిక్ వాహనాల తయారీతో డీజిల్, పెట్రోల్ వినియోగం తగ్గి ప ర్యావరణ కాలుష్యం కొంతవరకు తగ్గిందన్నారు. రైతులకు రూ.16 వేల 500 సబ్సిడీతో ఎరువు లను అందించి దేశానికి అన్నంపెట్టే రైతును త మ ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటోందన్నారు. గత ప్రభుత్వాలు దేశంలో, ఇటు రాష్ట్రంలో అప్పులు చేసినప్పటికి అప్పులను చెల్లిస్తూనే రాష్ర్టాలకు రావాల్సిన కేంద్ర ప్రభుత్వ నిదులను అందిస్తూ వస్తుందని ఎమ్మెల్సీ తెలిపారు. సాం కేతిక రంగంలో సమగ్రాభివృద్ధిని సాధిస్తూ, బుల్లెట్ ట్రైన్స్, వందేభారత్ రైళ్లు, ఎయిర్ పోర్టుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కృషి చే స్తోందన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా వినియోగించుకో లేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉందని విమర్శిం చారు. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏలు ఇవ్వడా నికి కూడా చేతకాకపోవడం సిగ్గుచేటన్నారు. అ నం తరం జిల్లా కేంద్రంలోని సత్యనారాయణ చౌరస్తా వరకు సేవా జ్యోతి ర్యాలీని కొనసాగిం చారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్‌పర్సన్ కొండా శ్వేత, వైస్ చైర్‌పర్సన్ మంజులరాఘవేం దర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పోషల్‌వినోద్, కౌన్సి లర్లు కమలాపూర్ ప్రభాకర్, జయశ్రీ, అప్పిరెడ్డి పల్లి రాము, సత్యరఘుపాల్, కల్పనరఘురామ య్య గౌడ్, కొండయ్య, పున్నంచంద్‌లాహోటి, బ ల్‌రాం, లక్ష్మీశ్యాంసుందర్‌గౌడ్ పాల్గొన్నారు.