Share News

నాలుగు రోజుల్లో నార్లాపూర్‌ పంపులు నడపాలి

ABN , Publish Date - Oct 07 , 2026 | 11:34 PM

కేఎల్‌ ఐ పంపులను నిర్విరామంగా నడిపి జూరాల నుంచి నీటి విడుదల చేసి పంటలు కాపాడా లని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

నాలుగు రోజుల్లో  నార్లాపూర్‌ పంపులు నడపాలి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి

- లేకపోతే రైతులతో కలిసి ముట్టడిస్తాం

- మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి

వనపర్తి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : కేఎల్‌ ఐ పంపులను నిర్విరామంగా నడిపి జూరాల నుంచి నీటి విడుదల చేసి పంటలు కాపాడా లని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం వనపర్తి పట్టణంలోని తన నివాసంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నీటి లభ్యత ఉన్నప్పటికీ ప్రభు త్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. ఈ నెల 12వ తేదీలోగా నార్ల పూర్‌ పంపులను ప్రారంభించకపోతే వేలాది మంది రైతులతో కలిసి ముట్టడిస్తామని హెచ్చ రించారు. కేఎల్‌ఐ పంపులను సక్రమంగా నడప కపోవడం, జూరాల నుంచి సకాలంలో నీటిని విడుదల చేయకపోవడంతో ఉమ్మడి పాలమూ రు జిల్లాలో 6 నుంచి 7 లక్షల ఎకరాల విస్తీర్ణం లో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింద న్నారు. అదేవిధంగా తనపై చేస్తున్న భూకబ్జా ఆరోపణలపై నిరంజన్‌రెడ్డి తీవ్రంగా స్పందించా రు. మంత్రులు పొంగులేటి, జూపల్లి తమ కలెక్టర్లు, అధికారులతో పాటు రాష్ట్ర మీడియా సమక్షంలో బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. తాను అరగుంట భూమిని ఆక్రమిం చి నట్లు రుజువైతే ముక్కు నేలకు రాసి క్షమా పణ చెబుతానన్నారు. సమావేశంలో గట్టు యా దవ్‌, బి.లక్ష్మయ్య, వాకిటి శ్రీధర్‌, లక్ష్మారెడ్డి, అశోక్‌, కృష్ణానాయక్‌ ఉన్నారు.

Updated Date - Oct 07 , 2026 | 11:35 PM