మళ్లీ మళ్లీ ప్రధానిగా నరేంద్ర మోదీ
ABN , Publish Date - Oct 08 , 2026 | 12:01 AM
India's reputation has increased in the world - Mahabubnagar MP DK Aruna
- ప్రపంచదేశాల్లో పెరిగిన భారతదేశ కీర్తి ప్రతిష్టలు
- మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ
- పాలమూరులో ఘనంగా సేవా జ్యోతి యాత్ర
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : దేశ ప్రధానిగా మళ్లీ మళ్లీ న రేంద్ర మోదీయే ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. ప్రజాసేవలో ముఖ్యమంత్రిగా, ప్రధానిగా నరేంద్రమోదీ 25 సంవత్సరాలు పూర్తి చేసు కున్నారని, ఈ సందర్భంగా సేవా జ్యోతి యాత్ర చేపట్టామని ఆమె తెలిపారు. సేవా సంకల్ఫ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం పాలమూరు జిల్లా కేంద్రంలో సేవా జ్యోతి యాత్ర నిర్వహించారు. పట్టణంలోని అంబేడ్కర్ కళాభవన్ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు కాగడాలతో ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో భారత దేశ కీర్తి ప్రతిష్టలను పెంచిన ఘనత మోదీకే దక్కిందన్నారు. వికసిత్ భారత్ - 2047 లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఆయనకు ప్రజలందరూ అండగా నిలవాలని కోరారు. పేద కుటుంబం నుంచి వచ్చిన మోదీ పాలనను చూసి కాంగ్రెస్ పార్టీ వారు జీర్ణించుకోలేక పోతున్నార ని మండిపడ్డారు. మోదీని అభాసుపాలు చేయాలని, దేశకీర్తిని పడగొట్టేందుకు వారు అనేక కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అంతకుముందు ఢిల్లీలో ప్రఽధాని మోదీ, జాతీ య అధ్యక్షుడు నితిన్ నబీన్ చేపట్టిన కార్యక్రమాన్ని స్థానిక అంబేడ్కర్ కళాభవన్‌లో నాయకులతో కలిసి టీవీలో వీక్షించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నాయకులు అంజయ్య, సుదర్శన్, డోకుర్ పవన్‌కుమార్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, జనార్ధన్‌రెడ్డి, కార్పొరేటర్లు రమేశ్, సంతోష్, జ్యోతి, పాండురంగారెడ్డి, మహిళ మోర్చా అధ్యక్షురాలు సాహితీరెడ్డి, శ్రీనాథ్, జిల్లా, మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.