Share News

నామాజీ హౌస్‌ అరెస్టు

ABN , Publish Date - Sep 22 , 2026 | 11:30 PM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆదేశాల మేరకు జూరాల ప్రాజెక్టుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర నాయకుడు, పార్టీ క్రమశిక్షణ సం ఘం సభ్యుడు నాగూరావు నామాజీ, పార్టీ ఇత ర నాయకులను నారాయణపేట పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు.

నామాజీ హౌస్‌ అరెస్టు
హౌస్‌ అరెస్టయిన నాగూరావు నామాజీ, నాయకులు

నారాయణపేట, సెప్టెంబరు 22 (ఆంధ్ర జ్యోతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆదేశాల మేరకు జూరాల ప్రాజెక్టుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర నాయకుడు, పార్టీ క్రమశిక్షణ సం ఘం సభ్యుడు నాగూరావు నామాజీ, పార్టీ ఇత ర నాయకులను నారాయణపేట పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నాగూ రావు నామాజీ మాట్లాడుతూ అరెస్టులతో ఉద్య మాన్ని ఆపలేరని అన్నారు. రైతు, ప్రజా ప్రభు త్వమని చెప్పుకునే కాంగ్రెస్‌ మంత్రులు ఎమ్మె ల్యేలు, రైతుల పంటలు ఎండిపోతున్నా ఎందు కు స్పందించడం లేదని ప్రశ్నించారు. వెంటనే పంట సాగుకు జూరాల నీటిని విడుదల చేయా లని, లేకపోతే ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అరెస్టయిన వారిలో కౌన్సిలర్లు, నాయకులు ఉన్నారు.

Updated Date - Sep 22 , 2026 | 11:30 PM