ఆలయ అభివృద్ధికి నా వంతు కృషి
ABN , Publish Date - Oct 30 , 2026 | 11:18 PM
కే.టి.దొడ్డి మం డల పరిధిలోని పాగుంట, వెంకటాపురం గ్రా మంలో పాగుంట లక్ష్మీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల(జాతర) పోస్టర్ను, ఆహ్వాన పత్రికను శుక్రవారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రె డ్డి చేతులమీదుగా ఆవిష్కరించారు.
పాగుంట లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్ విడుదల చేసిన ఎమ్మెల్యే బండ్ల
గద్వాల న్యూటౌన్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో త్వరలో జరుగబోయే కే.టి.దొడ్డి మం డల పరిధిలోని పాగుంట, వెంకటాపురం గ్రా మంలో పాగుంట లక్ష్మీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల(జాతర) పోస్టర్ను, ఆహ్వాన పత్రికను శుక్రవారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రె డ్డి చేతులమీదుగా ఆవిష్కరించారు. ఇందులో నవంబరు 9న కల్యాణ మహోత్సవం, 10న స్వామివారి పల్లకీసేవ ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతీ సం వత్సరం లాగానే ఈసారి కూడా పాగుంట లక్ష్మీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగ రంగ వైభవంగా నిర్వహించాలన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు, ప్రజలకు ఎ లాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలన్నారు. బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలన్నారు. దేవాలయ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పు డూ ఉంటాయన్నారు. కార్యక్రమంలో సర్పంచు తనయుడు తిమ్మారెడ్డి, మాజీ కౌన్సిలర్ అంజనేయులు, ఈవో పురేందర్ తదితరులు ఉన్నారు.