యోగా టోర్నీలో పతకాలు సాధించాలి
ABN , Publish Date - Sep 10 , 2026 | 11:21 PM
రాష్ట్రస్థాయి యోగా టోర్నీలో పతకాలు సాధించాలని ఉమ్మడి జిల్లా యోగా సం ఘం అధ్యక్షుడు ఆనంద్‌కుమార్‌గౌడ్ అన్నారు.
- యోగా సంఘం జిల్లా అధ్యక్షుడు ఆనంద్‌కుమార్‌గౌడ్
- రాష్ట్రస్థాయి యోగా పోటీలకు తరలిన జట్లు
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి యోగా టోర్నీలో పతకాలు సాధించాలని ఉమ్మడి జిల్లా యోగా సం ఘం అధ్యక్షుడు ఆనంద్‌కుమార్‌గౌడ్ అన్నారు. రాష్ట్ర స్థాయి యోగా టో ర్నీలో పాల్గొనే ఉమ్మడి జిల్లా బాల, బాలికల జట్లు తరలివెళ్లాయి. గు రువారం నగరంలోని ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్య క్రమంలో అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యోగాతో చదువులో చురుకుగా రాణిస్తారని తెలిపారు. టోర్నీ ప్రతిభ చాటి జాతీయస్థాయి పోటీల్లో జిల్లా క్రీడాకారులు చోటు దక్కించుకోవా లన్నారు. ప్రతిభ గల క్రీడాకారులకు అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, కార్యనిర్వహక చైర్మన్ రాములు, సభ్యులు బాల్‌రాజ్, పాండురంగం, అరుణజ్యోతి, పవన్ కుమార్, స్వరూపరాణి పాల్గొన్నారు.