సేంద్రియ వ్యవసాయంపై అవగాహన ఉండాలి
ABN , Publish Date - Jan 22 , 2026 | 11:05 PM
ప్రస్తుతం వ్యవసాయంలో జరుగుతున్న మార్పులకనుగుణంగా గ్రామీణ ప్రాంతా ల్లోని ప్రతీ రైతు సేంద్రియ వ్యవసాయం పై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉం డాలని కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేం ద్రం శాస్త్రవేత్త వెంకట్‌రెడ్డి అన్నారు.
- కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం శాస్త్రవేత్త వెంకట్‌రెడ్డి
తాడూరు, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం వ్యవసాయంలో జరుగుతున్న మార్పులకనుగుణంగా గ్రామీణ ప్రాంతా ల్లోని ప్రతీ రైతు సేంద్రియ వ్యవసాయం పై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉం డాలని కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేం ద్రం శాస్త్రవేత్త వెంకట్‌రెడ్డి అన్నారు. గురు వారం నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలంలోని ఇంద్రకల్ గ్రామంలోని రై తు వేదికలో సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంద్రక ల్ గ్రామంలో కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో రై తులకు మొక్కజొన్న, ఇతర రబీ పంటల్లో సమగ్ర సస్యరక్షణపైన రెండు రోజుల హెచ్‌ఆర్‌డీ(హ్యుమన్ రిసోర్స్ డెవలప్ మెంట్) శిక్షణ కార్యక్రమం నిర్వహించి నట్లు తెలిపారు. కా ర్యక్రమంలో 70మం ది వరకు రైతులు, పురుగు మందుల డీ లర్లు పాల్గొన్నారు. ముందుగా సీఐపీ ఎంసీ(సెంట్రల్ ఇం టిగ్రేటెడ్ పెస్ట్ మేనే జ్‌మెంట్ సెంటర్) హైదరాబాద్ ఇన్‌చా ర్జి వెంకట్‌రెడ్డి, ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ మాట్లాడారు. రైతుల కోసం సేంద్రియ సమగ్ర సస్యరక్షణ కేంద్రం హైదరాబాద్ నుంచి చేపడుతున్న పొలంబడి, హెచ్‌ఆర్ డీ శిక్షణ వంటి వివిధ రకాల కార్యక్రమా ల గురించి వివరించారు. అసిస్టెంట్ ప్లాం ట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉదయశంకర్, ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ బసవన్నప్ప మాట్లాడారు. కేవీకే పాలెం నుంచి వచ్చిన శాస్త్రవేత్త డాక్టర్ శైలా మొక్కజొన్న పంట లో కత్తెరపురుగు నివారణకు పాటించాల్సి న సమగ్ర సస్యరక్షణ చర్యలను వివరిం చారు. వ్యవసాయ శాఖ నుంచి పూర్ణచం ద్రరెడ్డి, ఏడీఏ, ఏవో సందీప్‌రెడ్డి, వ్యవసా య విస్తరణాధికారి శ్రీకాంత్ పాల్గొని రైతులకు మార్గదర్శనం చేశారు. ప్రాంతీ య వ్యవసాయ పరిశోధన స్థానం, పా లెం నుంచి విచ్చేసిన శాస్త్రవేత్తలు డాక్టర్ శశిభూషన్, డాక్టర్ శంకర్, డాక్టర్ శోభారా థోడ్, రైతులు అడిగిన వివిధ రకాల సం దేహాలను నివృత్తి చేశారు. మొక్కజొన్న పొలంలో మిత్ర పురుగులైన రెడువిడ్ పు రుగులను, ట్రైకోకార్డ్‌లను విడుదల చేశా రు. సర్పంచ్ బంగారమ్మ పాల్గొన్నారు.