Share News

ప్రభుత్వ శాఖలన్నింటిపై పట్టు సాధించాలి

ABN , Publish Date - May 27 , 2026 | 11:37 PM

అన్ని ప్రభుత్వ శాఖలపై పట్టు సాధించాలని జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ట్రైనీ ఐఏఎస్‌ అధికారులకు సూచించారు.

ప్రభుత్వ శాఖలన్నింటిపై పట్టు సాధించాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ శ్రీనివాసరావు

- ట్రైనీ ఐఏఎస్‌ అధికారులతో ఎస్పీ శ్రీనివాసరావు

- శిక్షణలో భాగంగా జోగుళాంబ గద్వాల జిల్లాలో పర్యటన

గద్వాల న్యూటౌన్‌/ అలంపూర్‌/ ఇటిక్యాల, మే 27 (ఆంధ్రజ్యోతి) : అన్ని ప్రభుత్వ శాఖలపై పట్టు సాధించాలని జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ట్రైనీ ఐఏఎస్‌ అధికారులకు సూచించారు. శిక్షణలో భాగంగా ట్రైనీ కలెక్టర్‌ ఎత్తబోయిన సాయిశివాని (మహబూబ్‌నగర్‌), సచిన్‌ బసవరాజు గుత్తూరు (వికారాబాద్‌), నేలటూరు శ్రీకాంత్‌రెడ్డి (నల్గొండ), పోతరాజు హరిప్రసాద్‌ (కరీంనగర్‌), పరాసు కుమార్‌ (ఖమ్మం), సురేశ్‌ పామూరి (నిజాంబాద్‌)లు బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాలులో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడారు. జోగుళాంబ గద్వాల జిల్లా విత్తన పత్తి పంటలకు ప్రసిద్ధి చెందింద ని, ఈ ప్రాంతం సీడ్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ తెలం గాణగా పేరు పొందిందని తెలిపారు. జిల్లాలో ని గట్టు మండలం అక్షరాస్యతలో వెనుకబడటంతో, ఆ ప్రాంత అభివృద్ధికి జిల్లా అధికార యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. అదనపు కలెక్టర్‌ మధుమోహన్‌ మాట్లాడుతూ ట్రైనీ కలెక్టర్లు తమ జిల్లాలోని వివిధ శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై తరుచూ సంబంఽధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అదన పు కలెక్టర్‌ నర్సింగరావు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వం ధాన్యం, మొక్కజొన్నలను కొ నుగోలు చేస్తోందని తెలిపారు. ఆయా కేం ద్రాల వద్ద కొనుగోలు ప్రక్రియ తీరును వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందేలా అధికారులు కృషి చేయాలన్నారు. సమావేశంలో భూసేకరణ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కృష్ణ, ఆర్డీవో శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

జోగుళాంబ సన్నిధిలో ట్రైనీ ఐఏఎస్‌లు

జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలం పూర్‌ క్షేత్రాన్ని బుధవారం రాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఆరుగురు ట్రైనీ ఐఏఎస్‌ అధికారులు దర్శించుకున్నారు. క్షేత్రస్థాయి పర్య టనలో భాగంగా అలంపూర్‌ క్షేత్రానికి వచ్చిన వారు స్వామి, అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు వారికి ఈవో దీప్తిరెడ్డి, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. వారి వెంట ఆర్‌ఐలు దుర్గాసింగ్‌, మాసుం, ఎస్‌ఐ రామకృష్ణ తదితరులు ఉన్నారు. అనంతరం వారు ఇటిక్యాల మండలంలోని ము నుగాల శివారులో వున్న ఆయిల్‌పాం తో టను పరిశీలించారు. రైతు శ్రీనివాసారెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. దిగుబడి బాగానే ఉందని, ఇప్పటి వరకు పెట్టుబడి కన్నా అధిక లాభాలు వచ్చాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మునుగాల సర్పంచు కొప్పుల ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2026 | 11:37 PM