Share News

ఇళ్ల ఎంపికలో ముస్లింలకు న్యాయం చేయాలి

ABN , Publish Date - Jan 11 , 2026 | 11:30 PM

జిల్లా కేంద్రంలోని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల రెండవ విడత కేటాయింపుల్లో ముస్లిం మైనార్టీలకు తగిన న్యాయం చేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ మై నార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు, ఆవాజ్‌ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అతిక్‌ఉర్‌ రెహమాన్‌ కోరారు.

ఇళ్ల ఎంపికలో ముస్లింలకు న్యాయం చేయాలి

  • బీఆర్‌ఎస్‌ మైనార్టీ నాయకుడు అతిక్‌ఉర్‌ రెహమాన్‌

గద్వాల టౌన్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంలోని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల రెండవ విడత కేటాయింపుల్లో ముస్లిం మైనార్టీలకు తగిన న్యాయం చేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ మై నార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు, ఆవాజ్‌ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అతిక్‌ఉర్‌ రెహమాన్‌ కోరారు. ఆదివారం పట్టణంలోని ఆవాజ్‌ కమిటీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. మొదటి విడతగా లక్కీ డిప్‌ పద్ధ్దతిలో చేపటిన ఎంపికల్లో కొంతమంది డిప్పు ద్వారా ఎంపిక అయినా రాజకీ య ఒత్తిడితో వారి పేర్లను తొలగించారని ఆరోపించారు. తొలగించిన దరఖాస్తుదారులకు సం బంధించి పూర్తిస్థాయి విచారణ జరపాలన్నారు. ఎంపికైన వారికి అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ కాపీ ఇచ్చినా ఇప్పటి వారికి ఇళ్లు అప్పగించలేదన్నారు. అధికారులు ఈసారైనా తగిన న్యాయం చేయాలని, లేనిపక్షంలో బాధితుల తరఫున ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామన్నారు. కాగా, ఇళ్ల కేటాయింపుల్లో అలాంట్‌మెంట్‌ ఆర్డర్‌ పొందిన వారు, డిప్‌ సందర్భంగా అన్యాయానికి గురైన వారు తమ పూర్తిస్థాయి వివరాలతో వెంటనే తమను సంప్రదించాలని పత్రికాముఖంగా కోరారు. సమావేశంలో సయ్యద్‌ యూసిఫ్‌, మెహ బూబ్‌, హమీద్‌, ఉబేదూర్‌ రెహమాన్‌, అఖిల్‌ ఉన్నారు.

Updated Date - Jan 11 , 2026 | 11:30 PM