Share News

అడ్డు తొలగించుకోవాలనే ప్రియురాలి హత్య

ABN , Publish Date - May 29 , 2026 | 11:16 PM

అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మహిళ కేసులో ఇద్దరు నిందితులను పట్టుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు.

అడ్డు తొలగించుకోవాలనే ప్రియురాలి హత్య
వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ శ్రీనివాస్‌యాదవ్‌, సీఐ అశోక్‌రెడ్డి

- డబ్బు కోసం వేధిస్తుండటంతో మరో ప్రియురాలితో కలిసి హత్య చేసిన ప్రియుడు

- గతంలో ప్రియురాలి భర్త హత్య

- అనుమానాస్పద మృతి కేసును ఛేదించిన పోలీసులు

నాగర్‌కర్నూల్‌ క్రైం, మే 29 (ఆంధ్రజ్యోతి): అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మహిళ కేసులో ఇద్దరు నిందితులను పట్టుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలోని సీఐ కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బిజినేపల్లి మండలం ఖానా పూర్‌ చెందిన మొగుతాళ్ల పార్వతమ్మ(46)తో అదే గ్రామానికి చెందిన సంకి రాములు వివా హేతర సంబంధం 2012 నుంచి కొనసాగుతుంది. కాగా తరచు డబ్బుల కోసం పార్వతమ్మ గొడవపడేదని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ఉద్దేశంతో తన మరో ప్రియురాలు డో కూరు లక్ష్మీతో కలిసి చంపేందుకు పథకంపన్నారు. ఈ నెల 26న పార్వతమ్మకు మద్యం తా గించి బిజినేపల్లి మండలంలోని ఖానాపూర్‌ శివారులో ఇద్దరు కలిసి హత్య చేశారు. అనం తరం మొక్కజొన్న పొత్తులో మృతదేహాన్ని కాల్చి వెళ్లిపోయారు. గుర్తు తెలియని మృత దేహంగా కేసు నమోదు చేసి పోలీసులు వివరాలు సేకరించి ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. సంకి రాములు గతంలో పార్వతమ్మ భర్త చంద్రయ్య అడ్డు వస్తున్నాడని 2016లో సింగోటం దేవస్థానం వద్ద తీసుకెళ్లి మద్యం తాగించి హత్య చేశాడు. ప్రస్తుతం పార్వతమ్మను హత్య చేసినట్లు విచారణలో పేర్కొన్నారు. సమావేశంలో నాగర్‌కర్నూల్‌ సీఐ అశోక్‌రెడ్డి ఉన్నారు.

Updated Date - May 29 , 2026 | 11:16 PM