Share News

ఆస్తి కోసం హత్య

ABN , Publish Date - Jun 26 , 2026 | 11:35 PM

ఆస్తి కోసం కట్టుకున్న భర్తనే అల్లుడు, కూతురు సహకారంతో హత్య చేసింది.

 ఆస్తి కోసం హత్య
విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శ్రీనివాస్‌యాదవ్‌, చిత్రంలో సీఐ అశోక్‌రెడ్డి, ఎస్‌ఐ శ్రీనివాసరావు

- భర్తను గొంతు నులిమి చంపిన భార్య

- సహకరించిన కూతురు, అల్లుడు

-తిమ్మాజిపేట మండలం ఆవంచలో వెలుగు చూసిన ఘటన

నాగర్‌కర్నూల్‌ క్రైం, జూన్‌ 26 (ఆంరఽధ జ్యోతి): ఆస్తి కోసం కట్టుకున్న భర్తనే అల్లుడు, కూతురు సహకారంతో హత్య చేసింది. తర చూ గొడవ పడుతూ అమ్మపల్లి యాదయ్య (54)ను ఆయన భార్య అమ్మపల్లి అలివేలు, కూతురు బండారి పద్మ, అల్లుడు బండారి ఆంజనేయులు తలపై ఇనప రాడ్డుతో కొట్టి గొంతు నులిమి చంపేశారు. ఈ సంఘటనలో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తు న్నట్లు డీఎస్పీ శ్రీనివాస్‌యాదవ్‌, సీఐ అశో క్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్ల డించారు. తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామానికి చెందిన అమ్మపల్లి యాదయ్య అలి వేలు దంపతులకు ఒకే ఒక కూతురు పద్మ ఉన్నా రు. పద్మకు గత 12ఏళ్ల క్రితం మిడ్జిల్‌ మండలం బోయినపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులుతో వివాహమైంది. అత్త అలివేలు, అల్లుడుతో చ నువుగా మెలిగి ఉండేది. ఇదే అదునుగా అత్త తో అల్లుడు వివాహేతర సంబంధం కొనసా గించాడు. అత్తను మచ్చిక చేసుకున్న క్రమం లో అల్లుడు మామ యాదయ్య పేరున ఉన్న భూమి (ఒక ఎకరం 20గుంటలు)ని తన పే ర చేయాలని తరచూ ఒత్తిడి తెచ్చేవాడు. ఇదే క్రమంలో అలివేల కూడా భూమిని అల్లుడి పేరిట చేయమని భర్తను ఇబ్బందులకు గురి చేసేది. ఈ నెల 23న మధ్యాహ్నం సమయం లో యాదయ్య, అతని భార్య అలివేలు గొడ వపడ్డారు. ఈ విషయం కూతురు పద్మ అల్లు డు ఆంజనేయులుకు తెలియజేసింది. పథకం ప్రకారం యాదయ్యను హత్య చేస్తే రైతు బీమా ఐదు లక్షలు వస్తుందని, దీంతోపాటు భూమి కూడా అల్లుడు పేరున చేయవచ్చని వారిని ఫోన్‌ ద్వారా తెలిపింది. వారిని పిలి పించి యాదయ్యను గొంతు నుమిలి ఊపి రాడకుండా చేసి తలకు రాడ్డుతో కొట్టి చంపే శారు. తర్వాత కూతురు, అల్లుడు వారి సొం త గ్రామానికి వెళ్లిపోయారు. యాదయ్య అనా రోగ్యంతో మృతి చెందాడని భార్య అలివేలు బంధువులకు తెలిపింది. అంత్యక్రియల సమ యంలో మృతదేహానికి స్నానం చేయించడా నికి తీసుకెళ్లగా ఒంటిపై బలమైన గాయాలు కన్పించడంతో వారి సమీప బంధువైన గడ్డమీ ద పరశురాములు పోలీసులకు ఫిర్యాదు చే శారు. ఈ సంఘటనలో కేసు నమోదు చేసిన తిమ్మాజిపేట పోలీసులు విచారణ జరిపారు. మృతుడి భార్య, కూతురు, అల్లుడు హత్య చే సినట్లు ఒప్పుకున్నారు. వారిని రిమాండ్‌కు తరలిస్తున్నామని డీఎస్పీ పేర్కొన్నారు.

Updated Date - Jun 26 , 2026 | 11:35 PM