Share News

మునిసిపల్‌ నామినేషన్ల పర్వం ప్రారంభం

ABN , Publish Date - Jan 28 , 2026 | 11:10 PM

జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీలలో నామినేషన్ల పర్వం ప్రారంభం అయ్యింది.

మునిసిపల్‌ నామినేషన్ల పర్వం ప్రారంభం
గద్వాల మునిసిపల్‌ కార్యాలయంలో నామినేషన్‌ కౌంటర్‌ను తనిఖీ చేస్తున్న కలెక్టర్‌ సంతోష్‌

  • గద్వాల, అయిజ, వడ్డేపల్లిలో ఒక్కోటి, అలంపూర్‌లో రెండు నామినేషన్ల దాఖలు

గద్వాల, జనవరి 28(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీలలో నామినేషన్ల పర్వం ప్రారంభం అయ్యింది. రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్‌ను విడుదల చేయడం తో పాటు బుధవారం నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. నామినేషన్లను స్వీకరించేందుకు గద్వాల మునిసిపాలిటీలో నామినేషన్‌ దాఖలు కేంద్రం ఏర్పాటు చేశారు. 37వార్డులకు 13కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఒక్కోకౌంటర్‌లో మూడు వార్డులకు సంబందించిన నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌తో పాటు నో టిఫికేషన్‌ ఒకేసారి రావడంతో మొదటి రోజు అ భ్యర్థులు నామినేషన్‌ పత్రాలను తీసుకున్నారు. వాటికి కావలసి పత్రాలను సేకరించే పనిలో ప డ్డారు. దీంతో మొదటిరోజు గద్వాలలో ఒకే నా మినేషన్‌ దాఖలయ్యింది. 28వ వార్డుకు చెందిన కంసలి శేఖర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. అయిజ మునిసిపాలిటీలో 20వార్డులు ఉండగా ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ యార్డులో ఏడు నామినేషన్‌ కౌంటర్లను ఏర్పాటు చేశారు. మొద టి రోజు 17వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థి ప్రమీ ల నామినేషన్‌ దాఖలు చేశారు. వడ్డేపల్లి ముని సిపాలిటీలో 10వార్డులు ఉండగా ఎంపీడీఓ, ఎ మ్మార్వో, ఎంఈఓ, మహిళా సమాఖ్య భవనంలో నామినేషన్‌ కౌంటర్లను ఏర్పాటు చేశారు. మొద టి రోజు 9వవార్డు నుంచి ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి అజయ్‌ కుమార్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. అలంపూర్‌ మునిసిపాలిటీలో 10 వార్డులు ఉండగా మునిసిపల్‌ కార్యాలయం లో రెండు నామినేషన్‌ కౌంటర్లు, మహిళా సమాఖ్య భవనంలో రెండు కౌంటర్లు ఏర్పాటు చేశారు. మొదటి రోజు 3వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా నాగమల్లయ్య, 8వవార్డునుంచి బీఆర్‌యస్‌ పార్టీ అభ్యర్థిగా రవి నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ పరిశీలించారు. కౌంటర్ల వద్దకు వెళ్లి ఆర్‌ఓలకు పలుసూచనలు చేశారు. ఆయన వెంట అదనపు కలెక్టర్‌ నర్సింగరావు ఉన్నారు.

Updated Date - Jan 28 , 2026 | 11:10 PM