అత్యవసర పనులకే ముడా నిధులు
ABN , Publish Date - Oct 30 , 2026 | 11:49 PM
మహబూబ్‌నగర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) నిధులను ప్రజల అవసరాల మేరకే విని యోగించాలని సభ్యులు నిర్ణయించారు.
- మౌలిక వసతులు, తాగునీటి అసరాలకు ప్రాధాన్యం
- సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యేల నిర్ణయం
మహబూబ్‌నగర్, అక్టో బరు 30 (ఆంధ్రజ్యోతి) : మహబూబ్‌నగర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) నిధులను ప్రజల అవసరాల మేరకే విని యోగించాలని సభ్యులు నిర్ణయించారు. అత్యవసర పనులకు పారదర్శకంగా ఖ ర్చు చేయనున్నారు. వ్యయం విషయంలో అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. పాలమూరు నగరంలోని ముడా కార్యాలయంలో చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్ అధ్యక్షతన శుక్రవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, దేవరకద్ర, జడ్చర్ల ఎమ్మెల్యేలు జి.మధుసూ దన్‌రెడ్డి, జనుంపల్లి అనిరుధ్‌రెడ్డి, మేయర్ మమత, కమిషనర్ రామాంజులరెడ్డి హాజరయ్యారు. సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ప్రజలకు అవసర మైన మౌలిక వసతులతో పాటు, తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రాధా న్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఎల్‌నినో నేపథ్యంలో ముందు జాగ్రత్తగా తాగు నీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గతంలో మంజూరై వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను గుర్తించి, త్వరితగతిన పూర్తి చే యాలని అధికారులకు సూచించారు. అసంపూర్తిగా నిలిచిపోయిన ఫంక్షన్‌హాళ్ళు, కమ్యూనిటీ భవనాలు, సమావేశ మందిరాల నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. త్వరలోనే ముడా పరిధిలోని ఎమ్మెల్యేలు అందరూ కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి అదనపు నిధులు మంజూరు చేయాలని కోరతామని చెప్పారు. అదనపు నిధులు వస్తే పెండింగ్ పనులను పూర్తి చేయడంతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుందని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.