పీఆర్సీ ప్రకటించకుంటే ఉద్యమం
ABN , Publish Date - Apr 08 , 2026 | 11:17 PM
ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్‌లకు రావలసిన పీఆర్సీని జూన్ 2వ తేదీలోగా ప్రకటించాలని, లేదంటే ఉద్య మ కార్యాచరణ రూపొందిస్తామని పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి హెచ్చరించారు.
- పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి
జడ్చర్ల, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి) : ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్‌లకు రావలసిన పీఆర్సీని జూన్ 2వ తేదీలోగా ప్రకటించాలని, లేదంటే ఉద్య మ కార్యాచరణ రూపొందిస్తామని పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలే కరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్ష నర్ల జేఏసీ సమావేశంలో ప్రధానమైన నాలుగు డిమాండ్లపై తీర్మా నిస్తామన్నారు. రాష్ట్రంలో గడిచిన మూడేళ్లలో 25 మంది ఉద్యోగులు రిటైర్డ్ అయ్యారని, ఒక్క రూపాయి రిటైర్మెంట్ బెనిఫిట్స్ తీసు కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు, కాంట్రాక్ట్‌లు అన్ని కలిపి ప్రతీ నెల రూ.700 కోట్లు విడుదల చేస్తున్నారని, వీరితో సంబంధం లేకుండా ఉద్యోగ విరమణ పొందిన వారికి అందే బెనిఫిట్స్ కోసం రూ.500కోట్లు అదనంగా కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రధా నమైన నాలుగు డిమాండ్‌లపై ఈ నెల17న రాష్ట్రంలోని అన్ని మండల, జిల్లా కేంద్రాలలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన చేపట్ట నున్నట్లు తెలిపారు. మే 5న రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలోని ధర్నాచౌక్, కలెక్టరేట్‌ల వద్ద సామూహిక నిరాహరదీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు. 14న హైదరాబాద్‌లో జేఏసీ సమావేశం నిర్వహించి, త దుపరి కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. అనంతరం రిటైర్డ్ ఉద్యోగుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పర్వతాలు, ఆంజ నేయులు, జమీలాబేగం, నయీమొద్దీన్, శంకర్‌బాబు, ఇమామొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.