వాహనదారులు హెల్మెట్ ధరించాలి
ABN , Publish Date - Jan 03 , 2026 | 11:19 PM
జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని అడ్డాకుల ఎస్‌ఐ శ్రీనివాస్ పేర్కొన్నారు.
మూసాపేట, జనవరి 3 (ఆంధ్రజ్యోతి) : జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని అడ్డాకుల ఎస్‌ఐ శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం శాఖాపూర్ టోల్‌ప్లాజా వద్ద రోడ్డు భద్రతా భవారోత్సవాల్లో భాగంగా వాహనదారులకు హెల్మెంట్ వాడటంతో పాటు రోడ్డు నియమ, నిబంధనలపై అవగాహన కల్పించారు. డ్రైవింగ్‌లో మొబైల్‌లో మాట్లాడవద్దని, కొద్దిపాటి నిర్లక్ష్యమే ప్రమాదానికి దారి తీస్తుందన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవన్నారు. లైసెన్స్, ఆర్సీ వెంట ఉండాలన్నారు. ప్లాజా మేనేజర్ కార్తీక్, రూట్ ఇన్‌చార్జి కిశోర్‌రెడ్డి, సేఫ్టీ ఇన్‌చార్జి రఘునందన్‌గౌడ్, షిప్టు ఇన్‌చార్జి సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు
నవాబ్‌పేట : మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని ఎస్‌ఐ విక్రం కోరారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా మండలంలోని చాకల్‌పల్లిలో శనివారం సర్పంచ్ చెన్నయ్యతో అవగాహన కల్పించారు. లైసెన్సుతో పాటు ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు.