ఎల్లమ్మ తల్లీ.. కరుణించమ్మా..
ABN , Publish Date - Jan 27 , 2026 | 11:10 PM
చంకలో కో ళ్లు, తలపై బోనాలు, చేతిలో క ల్లు తదితర వస్తువులతో ఎల్ల మ్మ తల్లీ కరుణించమ్మా... అంటూ భక్తుల శరణుగోశలు, పూనకాల మధ్య నారాయణపే ట మండలం లింగంపల్లి ఎల్లమ్మ దేవత జాతర ఉత్సవాలు భక్తజన సందోహం మధ్య మొదటి రోజైన మం గళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
- బోనాలు, పూనకాల మధ్య ఘనంగా ప్రారంభమైన ఉత్సవాలు
- లింగంపల్లిలో వైభవంగా పెద్ద బోనంకుండ ఊరేగింపు
- గగుర్పొడిచిన సాయమ్మ నోటికి తాళంవేసే సన్నివేశం
నారాయణపేటరూరల్, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): చంకలో కో ళ్లు, తలపై బోనాలు, చేతిలో క ల్లు తదితర వస్తువులతో ఎల్ల మ్మ తల్లీ కరుణించమ్మా... అంటూ భక్తుల శరణుగోశలు, పూనకాల మధ్య నారాయణపే ట మండలం లింగంపల్లి ఎల్లమ్మ దేవత జాతర ఉత్సవాలు భక్తజన సందోహం మధ్య మొదటి రోజైన మం గళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎల్లమ్మ తల్లీ కరుణించవమ్మా అంటూ శ రణు గోశలమధ్య వేలాదిగా భక్తులు ఎల్ల మ్మ దర్శనానికి బారులు తీరారు. భక్తిశ్ర ద్ధలతో భక్తులు తలపై వేప మండలాలతో బోనం కుండలను తెస్తూ సంకలో కోళ్లు, మహిళల పూనకాలు, పసుపు, బంఢారం చల్లుకుంటూ దేవతకు మొక్కుబడులను చెల్లించుకున్నారు. ఉత్సవాల్లో ప్రధాన ఘ ట్టమైన పెద్ద బోనం కుండ ముందు అ మ్మవారి భక్తురాలైన సాయమ్మ నోటికి తా ళంవేసే గగ్గుర్పొడిచే ప్రధాన ఘట్టం తిలకించేందుకు భక్తులు ఎగబడ్డారు. జిల్లా న లు మూలల నుంచే గాక కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పె ద్దసంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. దేవాల యం ముందు నుం చి పెద్దబోనం కుండ ముం దు సాయమ్మను ప్రదక్షిణలు చేయించి దేవాలయంలో ఒక పక్కనున్న పరుశురాం విగ్రహం వరకు తీసుకెళ్లి మూడుసార్లు ప్రదక్షిణలు చేయించారు. దేవాలయ వంశ పారంపర్య ధర్మకర్త పూజారి పరుశురాం పెద్ద బోనం కుండ మోయగా బోనంకుం డ వెంబడి పలువురు మహిళలు పూనకంతో ఊగిపోతూ ఆలయంచుట్టూ ప్రదక్షి ణలు చేశారు. మధ్యాహ్నం 1 గంట నుం చి 2గంటల వరకు జరిగిన పెద్దబోనం కుండ ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులు అమ్మవారిని కొలిచి మొక్కుబడులు చెల్లించు కున్నారు. నాలుగు వారాలపాటు సాగే ఈ ఉత్సవాల్లో రెండు వారాల పాటు అమ్మవారి అలంకరణను భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేస్తారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పేట రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తును నిర్వహించారు. బందోబస్తును పేట సీఐ శివశంకర్ పరిశీలించారు. రూరల్ ఎస్‌ఐ సి.రాముడు, గాయత్రి, శ్రీనివాసులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.