Share News

అమ్మా భవానీ..

ABN , Publish Date - Oct 14 , 2026 | 11:38 PM

మం డలంలో దేవీ ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో శరన్నవ రాత్రుల పూజలు నాల్గవ రోజు బుధవారం కొన సాగాయి.

 అమ్మా భవానీ..
వనపర్తి పట్టణంలోని వెంగళ్‌రావు నగర్‌ వద్ద అమ్మవారి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి శారదారెడ్డి

- భక్తిశ్రద్ధలతో కొనసాగతున్న శరన్నవరాత్రుల పూజలు

కొత్తకోట, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి) : మం డలంలో దేవీ ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో శరన్నవ రాత్రుల పూజలు నాల్గవ రోజు బుధవారం కొన సాగాయి. కొత్తకోట పట్టణంలోని అంబా భవాని ఆలయంలోని భవానీ మాత అర్ధనారీశ్వరిదేవిగా, కన్యకా పరమేశ్వరి దేవాలయంలోని వాసవీ మా త మహాచండీదేవిగా, భక్త మార్కండేయస్వామి ఆలయంలోని పార్వతీ దేవి శాకాంబరిదేవిగా, కోటిలింగేశ్వరస్వామి దేవాలయంలోని జ్ఞానాంబి కాదేవి లలితాదేవిగా భక్తులచే పూజలు అందు కున్నారు. కొత్తకోటలోని పాత పట్టణం, పాత కా లేజి, దండుగడ్డ, రాఘవేంద్ర కాలనీ, కానాయప ల్లి, పామాపురం, రామకృష్ణాపూర్‌, సంకిరెడ్డిపల్లి, అమడబాకుల గ్రామాల్లో ఏర్పాటు చేసిన దేవీ మండపాల్లో పూజలు కోనసాగించారు.

మహా చండీమాతగా అమ్మవారు

గోపాల్‌పేట, (ఆంధ్రజ్యోతి): మండల కేం ద్రంలో చెన్నకేశవ ఆలయం దగ్గర దేవీ నవరా త్రుల ఉత్సవాలను గ్రామస్థులు ఘనంగా నిర్వ హిస్తున్నారు. బుధవారం ఉదయం వేద పండి తులు వస్తలయ్య ఆధ్వర్యంలో అమ్మవారికి ప్ర త్యేక పూజలు, నవగ్రహాల పంచామృత అభిషే కం, గణపతి పూజలు నిర్వహించారు. భక్తులకు అమ్మవారు మహా చండీదేవి రూపంలో దర్శనం ఇచ్చారు. సాయంత్రం అమ్మవారికి లక్ష గాజు ల ఆరాధన నిర్వహించి పెద్దఎత్తున మహిళల తో కుంకుమ అర్చన కార్యక్రమం మొదలగు పూజా కార్యక్రమలు జరిపించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.

అమరచింతలో..

అమరచింత, (ఆంధ్రజ్యోతి): మహాచండీదేవి అలంకరణలో బుధవారం అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా పట్టణంలోని శ్రీకృష్ణనగర్‌లోని కాళికాదేవి ఆలయంలో సామజ గన్‌వాడ, శ్రీవిఘ్నేశ్వర భవాని నగర్‌ తదితర ప్రాంతాల్లో వెలసిన అమ్మవారి మండపాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు క్యామరాములు, కొట్టం నాగేశ్వర్‌రెడ్డి, తాటికొండ రమేష్‌, కౌన్సిలర్‌ మేర్వ రాజు, ఎర్ర సత్యనారాయణ పాల్గొన్నారు.

పూజల్లో ఎమ్మెల్యే సతీమణి

వనపర్తి, (ఆంధ్రజ్యోతి): వనపర్తి పట్టణంలో ని 28వ వార్డు వెంగళరావు కాలనీ పార్కులో ప్ర తిష్ఠించిన దుర్గామాత విగ్రహం వద్ద బుధవారం నిర్వహించిన పూజల్లో ఎమ్మెల్యే మేఘారెడ్డి సతీ మణి శారదారెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు అన్నప్రసా దం పంపిణీ చేశారు. కౌన్సిలర్‌ కోట్ల శిరీష, రవి, దుర్గామాత కమిటీ సభ్యులు శారదారెడ్డిని శాలు వాతో సన్మానించారు.

Updated Date - Oct 14 , 2026 | 11:38 PM